దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత, రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం వంటిది. ఆయన జీవించి ఉన్నన్ని రోజులూ ఆయనపై ఎటువంటి వివాదాలూ లేవు. అయితే, ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా ‘యాత్ర’ చిత్రాన్ని దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించారు. ఫిబ్రవరి 8న విడుదల కానున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తయ్యింది. వైఎస్ నిజజీవితం మాదిరిగానే ఈ చిత్రంలోనూ ఎటువంటి వివాదాలూ, కాంట్రవర్సీలూ లేనట్లున్నాయి. అందుకే ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ యూ సర్టిఫికేట్ ను సెన్సార్ ఇచ్చింది. అంతేకాదు, వైఎస్ఆర్ గురించి అందరినీ ఆకట్టుకునేలా తెరకెక్కించారని చిత్రబృందాన్ని సెన్సార్ బోర్డు సభ్యులు అభినందించారట. ఈ సినిమా గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమానులు ఇప్పటికే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here