ఆంద్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. అభ్యర్దులు రేయింపగళ్లు కష్టపడి ఓ వైపు టెన్షన్ మరోవైపు విమర్శల మధ్య ప్రచారం చేసి అలసిపోయారు… కాస్త రిలాక్స్ అవుదామనుకున్నా కూడా వారికి మరో టెన్షన్ పట్టుకుంది… ఏమి చేయాలో పాలుపోని పరిస్తితి…. ఎలక్షన్ కమీషన్ ను ఎలా ప్రసన్నం చేసుకోవాలో అర్ధం కానీ సిట్యువేషన్.. గెలుపోటుముల భయమా… కాదనే అంటున్నారు,.. మరి అభ్యర్దుల టెన్షన్ ఏంటో చూడండి.

2019 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే వుద్దేశంతో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ శాయశక్తులా పనిచేసారు… అంతేకాదు తమ దగ్గర ఆయుధాలు అన్నీ కూడా ఉపయోగించారు… ఏరకంగానైనా ఓటర్లను తమ వైపు తిప్పుకుని తాము గెలిచేలా ఓట్లు వేయించుకోవడానికి నానా హైరాణా పడ్డారు.. ముఖ్యంగా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి నోట్లకట్టలతో పాటుగా వారికి కావలసిన అన్ని అవసరాలను తీర్చడానికి విశ్వప్రయత్నాలు చేసారు….ఒక్కో అభ్యర్ది కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది,, అథికార పార్టీకి చెందిన నేతే ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది…

ఇదంతా బాగానే వుంది… ఖర్చు చేయడం ఒక ఎత్తైతే ఇప్పుడు తమ ఖర్చులను చూపడం మరోఎత్తు… విచ్చలవిడిగా ఖర్చు చేయడంతో, ఈ లెక్కలను ఎక్కడ చూపాలనే దానిపై అభ్యర్థులు తర్జనభర్జన పడుతున్నారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేసినట్టు తెలిసింది. ఎలాగైనా సరే గెలవాలనే లక్ష్యంతో ఒక్కొక్కరు కనీసం రూ.20 కోట్ల నుంచి రూ.40కోట్ల వరకు ఖర్చు స్పెండ్ చేసినట్లు తెలుస్తోంది… ఇక ఎంపి అభ్యర్థులు అయితే, దాదాపు రూ.100 కోట్ల పైనే ఖర్చుచేయాల్సి వచ్చిందని వినికిడి..

ఎలక్షన్ కమీషన్ రూల్ ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల్లో రూ.28లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీల్లేదు. ఎంపీ అభ్యర్థి అయితే, రూ.70లక్షల వరకు ఖర్చు చేయొచ్చు. అయితే, ఎవరు ఎంత మొత్తం ఖర్చు చేశారనేది చెప్పాల్సింది అభ్యర్థులే మాత్రమే కాదు, కేంద్ర ఎన్నికల సంఘం కూడా. జనసేన, బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులు అంతస్థాయిలో డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి లేదనే వాదన. టీడీపీ, వైసీపీ మాత్రం కోట్లాది రూపాయలు కుమ్మరించాయని తెలుస్తోంది. ఓటర్లకు కూడా రూ.1000 నుంచి రూ.2000 ఇచ్చినట్టు ఒకరిపై ఒకరు కంప్లైట్స్ కూడా ఇచ్చేసుకున్నారు ఈ కంప్లైట్స్ ను ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంటే ఇక పరిస్తితి ఏంటో అనే ఆందోళన అభ్యర్దుల్లో కనపడుతోంది…అభ్యర్థి ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారని తెలుసుకోవడానికి ఎన్నికల కమిషన్ వ్యయ, నిఘా అధికారులను నియమించింది కూడా .వీళ్ళంతా కూడా అభ్యర్ది రోజుకు ఎంతఖర్చు పెట్టారన్నది సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ కు పంపించారట. దీంతో అభ్యర్దులు తాము ఇచ్చే లెక్కలకు ఆఫీసర్స్ ఇచ్చిన లెక్కలకు పొంతన వుండదని ఓపెన్ గానే అంటున్నారు.. ఆల్రెడీ కొంతమంది అభ్యర్దులు ఈసీనుండి నోటీసులు అందుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి… తమకి ఈసీ నోటీసులు పంపుతుందోననే ఆందోళనలో గడిపేస్తున్నారు.. అందులో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలకు చెందిన వారూ ఉన్నారు.

ఏ ఎలక్షన్ జరిగినా కూడా అభ్యర్దులు పోలింగ్ తేదీ నుంచి నెల రోజుల లోపు తమ జమాఖర్చులను ఈసీకి లెక్క చెప్పాల్సి ఉంటుంది. రిజల్ట్స్ వచ్చినా కూడా అకౌంట్స్ విషయంలో మాత్రం ఈసీ సీరియస్ గానే స్పందిస్తుంది… అంతేకాదు తమ నిబంధనలకు వ్యతిరేకంగా ఖర్చు చేసిన వారిపై ఇనకంటాక్స్ కూడా వివరాలు అందిచనుందని ఈసీ అధికారులు అంటున్నారు… మరి వీరు నిజంగా ఖర్చు పెట్టిన లెక్కలు పంపిస్తారా లేక తిమ్మిని బమ్మిని చేసి లెక్కలు పంపిస్తారో వేచిచూడాలి… వీరి లెక్కలపై ఈసీ ఎలాగా స్పందిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ…….

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here