ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. స్వంత పార్టీలో తమకు ప్రాధాన్యత లేదని భావిస్తున్న నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు ఆయన నిన్న తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమై చర్చించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు లేదా భద్రాచలం నుంచి పోటీ చేయాలని రాములు నాయక్ భావిస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఇందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here