మై ఛానల్ నా ఇష్టం పేరిట నాగబాబు స్టార్ట్ చేసిన ఆయన.. తాజాగా ఇప్పుడు పొలిటికల్ ఫీచర్ స్టార్ట్ చేసి .. సెటైర్లు గుప్పుస్తున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ పై వ్యంగాస్త్రాలు సంధించారు మెగా బ్రదర్ నాగబాబు. ఈ ఛానల్ ద్వారా కేవలం తన పొలిటికల్ అభిప్రాయాలను మాత్రమే పంచుకుంటానని .. కేవలం నవుకోవడానికి మాత్రమే ఈ వీడియోస్ అని ఆయన వెల్లడించారు. దీనిపై ఎవరూ కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోనవసరం లేదని చెప్పుకొచ్చారు. మీరు ఎప్పుడూ ఎక్కడా చూడని .. లేదా చూసి వాటిని నిశబ్దంగా మర్చిపోయిన వాటిని చూపిస్తానని .. వీటిలో కేవలం నా వ్యతిగత అభిప్రాయాలు మాత్రమే పోస్ట్ చేస్తానని తెలిపారు.

ఈ ఫీచర్ లో భాగంగా లోకేష్ ఓ బహిరంగ సభలో మాట్లాడిన మాటలను మనకు గుర్తు చేస్తూ ..అయన పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతుంది.నిజాయితీగా మాట్లాడే రాజకీయ నాయుకులు మనకు చాలా అరుదుగా ఉంటారని … అటువంటి వారిలో నారా లోకేష్ ఒకరని వెటకారం చేశారు. ఆ బహిరంగ సభలో లోకేష్ మాటలను మనం తప్పక పాటించాలని అయన కోరారు.ఆ వీడియో కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here