ప్రధాని నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. తృణమూల్
కాంగ్రెస్ నేతలకు బొగ్గు మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే, వాటిని నిరూపించాలంటూ మమతా బెనర్జీ సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపిస్తే.. తమ 42 మంది
ఎంపీ అభ్యర్థులను బరి నుంచి తప్పిస్తామని ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను
బీజేపీ రుజువు చేయలేకపోతే మోదీ చెవులు పట్టుకుని వంద గుంజీళ్లు తియ్యాలని ఛాలెంజ్ విసిరారు.

ఈనెల 7న ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ
మీద ఆరోపణలు చేయడంతో ఆయన్ను చెంప దెబ్బ కొట్టాలన్నంత కోపం వచ్చిందని మమతా బెనర్జీ
అన్నారు. ఆ విధంగా చెయ్యి పైకెత్తి హావభావాలు ప్రదర్శించారు. దీనికి మోదీ కూడా కౌంటర్ ఇచ్చారు.

‘దీదీ నన్ను చెంపదెబ్బ కొట్లాలనుకుంటోంది. దీదీ.. నేను మిమ్మల్ని నా సోదరిగా భావిస్తున్నా. మీ
చెంపదెబ్బ నాకు ఆశీస్సులతో సమానం. కానీ, చిట్ ఫండ్ పేరుతో జనం డబ్బులు దోచుకున్న వారిని
కొట్టే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఆ ధైర్యం ఉంటే ఇప్పుడు ఇలా భయపడరు.’ అని మోదీ
అన్నారు. మమతా బెనర్జీ ఫ్రస్ట్రేషన్ ఆమె హావభావాల్లో కనిపిస్తోందని మోదీ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here