ఈ రోజుల్లో ఏ హీరోకైనా 25 సినిమాల మైలురాయి అంటే గొప్ప విష‌య‌మే.. దాన్ని మ‌రింత ప‌క్కాగా ప్లాన్ చేసుకుంటుంటారు.. మ‌హేశ్ బాబు కూడా ఇదే చేసాడు. త‌న మైల్ స్టోన్ సినిమా క‌థ విష‌యంలో చాలా
ప‌క్కాగా ఆలోచించాడు.. ఓ మంచి క‌థ‌ను ఎంచుకోవాల‌ని ఫిక్సైపోయి మ‌రీ.. రైతుల కోసం రైతుల చుట్టూ
సినిమా చేసాడు.

అదే మ‌హ‌ర్షి.. అయితే క‌థ వ‌ర‌కు బాగానే అనిపించినా.. ఎక్క‌డో తెలియ‌ని వెలితి మాత్రం సినిమా
అంతా క‌నిపించింది. ఎందుకో తెలియ‌ని ఓ స్లో నెరేష‌న్ అడుగడుగునా మ‌హ‌ర్షి సినిమాకు అడ్డు ప‌డింది.
దానికి తోడు 3 గంట‌ల‌కు పైగా ఉండే నిడివి కూడా ప్రేక్ష‌కుల‌ను ఇబ్బంది పెడుతుంది.

దేవీ శ్రీ ప్ర‌సాద్ ఎందుకో కానీ మ‌హ‌ర్షికి మ‌న‌స్పూర్తిగా మ్యూజిక్ ఇవ్వ‌లేదేమో అనిపించింది. ఆయ‌న
సంగీతంలో ఉండే ప్రాణం ఇందులో మిస్ అయిన‌ట్లు అనిపించింది. ప‌ద‌రా ప‌ద‌రా పాట బాగుంది.
బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సోసోగానే అనిపించింది. ఎడిట‌ర్ ప‌నితనం వీక్. 3 గంట‌ల సినిమా కావ‌డంతో
బోర్ కొట్టించాడు.

అక్క‌డ‌క్క‌డా కొన్ని సీన్లు ట్రిమ్ చేసుంటే బాగుండేదేమో..? ద‌ర్శ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి అనుకున్నంత‌గా
విజ‌యం సాధించ‌లేదేమో అనిపిస్తుంది. క‌థ‌కుడిగా మాత్రం మంచి క‌థ‌నే తీసుకున్నా.. దాన్ని
తెర‌కెక్కించ‌డంలో విఫ‌లం అయ్యాడు. స్లో నెరేష‌న్ మ‌హ‌ర్షికి మైన‌స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here