తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త న‌టి జయలలిత పాత్ర‌కు ప్రాణం పోయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. తాజాగా జ‌య‌ల‌లిత బ‌యోపిక్ అనౌన్స్ చేసారు. ఇప్ప‌టికే ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ బ‌యోపిక్ వెబ్ సిరీస్ రూపంలో వ‌స్తుంది. ఇక ఇప్పుడు ద‌ర్శ‌కుడే ఏఎల్ విజ‌య్ ఈ బ‌యోపిక్ చేయ‌బోతున్నాడు.

ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించిన విష్ణు ఇందూరి ఇప్పుడు త‌లైవి సినిమాను నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 24వ తేదీ జయలలిత జ‌యంతి. దాంతో ఈ జ‌యంతి సంద‌ర్భంగా ఏఎల్ విజయ్ జయలలిత బయోపిక్‌ను అనౌన్స్ చేసాడు. ఈ సినిమాకు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం తొమ్మిది నెల‌లుగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు విజ‌య్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here