ఐపీఎల్‌ పన్నెండో సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ శుభారంభం చేసింది. శనివారం చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో స్పిన్నర్లు విజృంభించిన తొలి పోరులో సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. మొదట హర్భజన్‌ సింగ్‌ (3/20), ఇమ్రాన్‌ తాహిర్‌ (3/9), జడేజా (2/15)ల ధాటికి బెంగళూరు 17.1 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ పార్థివ్‌ పటేల్‌ (29) మినహా జట్టులో ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేదు. అనంతరం లక్ష్యాన్ని చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంబటి రాయుడు (28) టాప్‌స్కోరర్‌.

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) జడేజా (బి) హర్భజన్‌ 6; పార్థివ్‌ (సి) జాదవ్‌ (బి) బ్రావో 29; మొయిన్‌ అలీ (సి) అండ్‌ (బి) హర్భజన్‌ 9; డివిలియర్స్‌ (సి) జడేజా (బి) హర్భజన్‌ 9; హెట్‌మయర్‌ రనౌట్‌ 0; శివమ్‌ దూబె (సి) వాట్సన్‌ (బి) తాహిర్‌ 2; గ్రాండ్‌హోమ్‌ (సి) ధోని (బి) జడేజా 4; సైని (సి) వాట్సన్‌ (బి) తాహిర్‌ 2; చాహల్‌ (సి) హర్భజన్‌ (బి) తాహిర్‌ 4; ఉమేశ్‌ (బి) జడేజా 1; సిరాజ్‌ 0; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (17.1 ఓవర్లలో ఆలౌట్‌) 70;

చెన్నై ఇన్నింగ్స్‌: వాట్సన్‌ (బి) చాహల్‌ 0; రాయుడు (బి) సిరాజ్‌ 28; రైనా (సి) దూబె (బి) మొయిన్‌ అలీ 19; జాదవ్‌ నాటౌట్‌ 13; జడేజా నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (17.4 ఓవర్లలో 3 వికెట్లకు) 71;
వికెట్ల పతనం: 1-8, 2-40, 3-59;

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here