ఇంటిప‌ట్టున సుఖంగా గడుపుతూ అప్పుడ‌ప్పుడూ అవ‌సరార్థం ప్ర‌జ‌ల్లోకి ఇలా వ‌చ్చి… అలా మాయ‌మయ్యేవాడైతే.. వైఎస్ జ‌గ‌న్ అసలు కాంగ్రెస్ పార్టీనుంచే బైట‌కు వ‌చ్చేవాడు కాదు. కాంగ్రెస్ హై క‌మాండ్ చెప్పిందానికి త‌ల వూపి స‌మ‌యం కోసం కాచుకొని కూర్చొని వుండేవాడు. చాటుమాటు రాజ‌కీయాలు చేసుకుంటూ ప‌రిస్థితుల‌ను త‌న చేతుల్లోకి తీసుకోవ‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించేవాడు. నాటి కేంద్ర మంత్రి ఆజాద్ చెప్పిన‌ట్టు కేంద్ర‌మంత్రి కూడా అయ్యిండేవాడు. ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రి కూడా అయ్యిండేవాడేమో. అంతే కాదు ఈ కేసులనేవే వుండేవి కావు.

అస‌లు.. స‌మ‌స్య ఎక్క‌డ వ‌చ్చింది?

ఇది ప‌దేళ్ల క్రితం సంగతి ఇది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అకాల మ‌ర‌ణం త‌ర్వాత జ‌రిగింది. 2009 సెప్టెంబ‌ర్ 2న‌ వైఎస్సార్ ప్ర‌యాణం చేస్తున్న హెలికాప్ట‌ర్ కూలిపోయింది. కూలిపోయిన‌ ప్రాంతం పావురాల గుట్ట‌. ఇది క‌ర్నూలు జిల్లాలో వుంది. పావురాల గుట్ట‌ద‌గ్గ‌ర‌ నివాళి ఘ‌టించిన వైఎస్ జ‌గ‌న్ అక్క‌డే న‌ల్ల‌కాలువ ద‌గ్గ‌ర ఏర్పాటు చేసిన నివాళి స‌భ‌లో వైఎస్సార్ అభిమానుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. వైఎస్సార్ అకాల మ‌ర‌ణం త‌ట్టుకోలేక‌ ఆయ‌న్ను అబిమానించేవారు అనేక మంది గుండె ఆగి మ‌ర‌ణించార‌ని, రాబోయే రోజుల్లో వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శిస్తాన‌ని…వైఎస్సార్ కొడుకుగా ఇది త‌న బాధ్య‌త‌ని ఆ నాడు న‌ల్ల‌కాలువ స‌భ‌లో అప్ప‌టిక‌ప్పుడు ఎమోష‌న‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఇది ఎమోష‌న‌ల్ ఫీలింగ్‌. ఆ ప‌రిస్థితులు అలాంటివి. స‌రిగ్గా అక్క‌డ ఆ ప్ర‌క‌ట‌న ద‌గ్గ‌ర‌నుంచే కుటిల‌ రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. వైఎస్ జ‌గన్ ఎప్పుడైతే మాట ఇచ్చాడో అప్ప‌టినుంచీ ఆయ‌న చుట్టూ విష ప్ర‌చారాలు, క‌ట్టుక‌థ‌లు, కుట్ర‌లు, కుతంత్రాలు నెమ్మ‌దిగా రూపుదాల్చుకుంటూ వ‌చ్చాయి. మాట అనేది వైఎస్ కుటుంబానికి సంబంధించిన ఒక విలువ‌. ఒక లెగ‌సీ. ఎన్ని కష్టాలొచ్చినా దాని మీద నిల‌బ‌డుకోవాల‌నేది వైఎస్సార్ ఆచ‌రించిన విలువ‌. వైఎస్ జ‌గ‌న్ కు వార‌స‌త్వంగా వ‌చ్చిన విలువ‌.

వైఎస్ మ‌ర‌ణ‌వార్త విని గుండె ఆగి చ‌నిపోయిన‌వారు పేద‌వాళ్లు. వైఎస్ మీద అప‌రిమిత‌మైన ప్రేమ‌ను పెంచుకున్న‌వారు. అలాంటి అభిమానుల గురించి వైఎస్ జ‌గ‌న్ తెలుసుకోవాల‌నుకున్నారు. ఇది ఆయ‌న దృక్ప‌థం. మాన‌వ‌త్వం వున్న‌వారికి వ‌చ్చే ఆలోచ‌న . వారిలో ఎందుకు అంత ప్రేమో…స్వ‌యంగా తెలుసుకోవాల‌నుకున్నారు వైఎస్ జ‌గ‌న్‌. వారి కుటుంబాల‌ మంచి చెడ్డ‌లు చూడాల‌నుకున్నారు. వారి ఇంటికి వెళ్లి ఎంతో కొంత‌ ఆర్ధిక సాయం చేయాల‌నుకున్నారు. ఒక కొడుకు… త‌న తండ్రితో అనుబంధ‌మున్న ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి వారితో మ‌మేకం కావ‌డం త‌ప్పా? దానివ‌ల్ల కాంగ్రెస్‌కు వ‌చ్చే న‌ష్టం ఏంటి? వైఎస్ జ‌గ‌న్ ..త‌న తండ్రిలాగే ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌డమేమైనా త‌ప్పు ప‌నా? చేయ‌కూడ‌ని ప‌నా? అలా అని రాజ్యాంగంలో రాశారా?

కాంగ్రెస్ హై క‌మాండ్ కు ఎవ‌రు ఏ స‌ల‌హా ఇచ్చారోగానీ… ఓదార్పు యాత్ర‌ను ఆపాల‌ని వైఎస్ జ‌గ‌న్‌కు… సోనియా గాంధీనుంచి ఆదేశాలు. ఇది తెలిసి వైఎస్ జ‌గ‌న్ ఆశ్చ‌ర్య‌పోయాడు. ఎందుకు? ఇందులో ఏం త‌ప్పుంది? హై క‌మాండ్ కు వైఎస్ జ‌గ‌న్ వేసిన సూటి ప్ర‌శ్న‌లివి. మేం చెప్పిందే చేయి…అంతే త‌ప్ప ఓదార్పు యాత్ర చేస్తానంటే కుద‌ర‌దన్నారు. ఇలాంటి అర్థం ప‌ర్థం లేని నిబంధ‌న‌ల్ని వైఎస్ కుటుంబం అంగీక‌రిస్తుందా? ఒక వైపు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట‌. మ‌రో వైపు ఢిల్లీ పెద్ద‌ల ఆదేశం. ఇలాంటి ప‌రిస్థితుల్లో వైఎస్ జ‌గ‌న్ , ఆయ‌న త‌ల్లి విజ‌య‌మ్మ త‌మ ప‌ద‌వుల‌కు, పార్టీకి రాజీనామా చేసి బైట‌కు వ‌చ్చారు. ఎన్ని క‌ష్టాలు వచ్చినా స‌రే మాటే ముఖ్య‌మనుకున్నారు. ఢిల్లీ పెద్ద‌ల‌తో పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఉప ఎన్నిక‌ల్లో రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచారు. స్వంతంగా పార్టీని పెట్టుకున్నారు. దాంతో కాంగ్రెస్ హై క‌మాండ్ బుస‌లు కొట్టింది. ఇలాంటి ప‌రిస్థితి కోస‌మే…కాచుకొని కూర్చున్న కాల‌నాగు చంద్ర‌బాబు పాల‌ల్లో నీళ్ల‌లా కాంగ్రెస్‌తో క‌లిసిపోయాడు. ఎక్క‌డా లేని విధంగా వైఎస్ జ‌గ‌న్ పై కేసులు పుట్టుకొచ్చాయి. కాంగ్రెస్ నుంచి బైట‌కు రాగానే వైఎస్ జ‌గ‌న్ చెడ్డ‌వాడ‌య్యాడు. సిబిఐ దాడులు, ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడి) దాడులు, ప‌చ్చ మీడియాలో ప‌నికిమాలిన క‌థ‌నాలు అనేకం. ఇక్క‌డ ప‌చ్చ మీడియా ప‌గ ఎందుకంటే …సాక్షి మీడియా ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గడం ఈనాడు రామోజీరావు, ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ‌లాంటివారికి ఇష్టం లేదు. వైఎస్ జ‌గ‌న్ ను దెబ్బ కొడితే కాల‌క్ర‌మంలో సాక్షి మీడియా కూడా చ‌చ్చిపోతుంద‌నేది వారి వ్యూహం.

ఈ ప‌దేళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానంలో వైఎస్ జ‌గ‌న్…అనేక‌క‌ష్టాల‌ను ఎదుర్కొన్నాడు. 16 నెల‌ల జైలు జీవితం గ‌డిపాడు. దేవుడు వున్నాడు,ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాలున్నాయి అనుకుంటూ ముందుకు సాగాడు. పార్టీని బ‌తికించుకుంటూ నిల‌బెట్టుకుంటూ వ‌స్తున్నాడు. త‌న‌ను న‌మ్ముకున్న‌వారిని ఏనాడూ వ‌దిలేయ‌లేదు. ఏదో ఆశించి పార్టీలోకి వ‌చ్చి ..ఆ ఆశించిన‌ది ద‌క్క‌క ఇష్టానుసారం మాట్లాడిన‌వారిని వారి విచ‌క్ష‌ణ‌కే వ‌దిలేశాడు. అలా మాట్లాడిన‌వారు ప‌శ్చాత్తాపంతో తిరిగి ద‌గ్గ‌ర‌కు వ‌స్తే …వ‌ద్ద‌న‌కుండా ద‌గ్గ‌ర‌కు తీసుకుంటున్నాడు. పూట‌కో మాట మాట్లాడుతున్న‌వారు విజ‌న‌రీలుగా ప్ర‌శంస‌లు పొందుతున్న ఈ కాలంలో ఒక మాట కోసం నిల‌బ‌డేవారు అరుదుగా వుంటారు. ఆ అరుదైన వారిలో ఒక‌రు కాబ‌ట్టే వైఎస్ జ‌గ‌న్ ఎక్క‌డ‌కు పోయినా అక్క‌డ‌కు వేల‌మంది జ‌నం త‌ర‌లివ‌స్తున్నారు. మిట్ట మ‌ధ్యాహ్నం ఎండ‌లో కూడా గంట‌ల త‌ర‌బ‌డి నిల‌బ‌డుకొని అత‌ను చెప్పేది ఆసాంతం వింటున్నారు.ద‌టీజ్ ది ప‌వ‌ర్ ఆప్ రియ‌ల్ లీడ‌ర్‌. నో డౌట్ ఏపీ విల్ బి ఇన్ సేఫ్ హాండ్స్‌.
-చెమిక‌ల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here