Opచిన్న హార్మోనీ తో ప్రారంభించిన రాగాల
వేట ఎన్నెన్నో స్వరాల ప్రయోగాలు కు
రాచబాటగా తన రహదారికి గమ్యం,
అలుపు సొలుపు లేని బాటసారి. ఇటు
శాస్త్రీయ సంగీతాన్ని అటు పాశ్చాత్య
సంగీతాన్ని మధించి శ్రోతలను మరో
లోకానికి తీసుకెళ్లి ఊయలలో జోలపాడి మైమరింపిచారు. తన స్వరాలు కు పదాల ఫలాలు పండించి
ఆ కోకిల కూడా కూయడం మానేసి
మౌనంగా శ్రోతగా……. మారిపోతుందనడంలో అతియోశక్తి
కాదేమో…..
ఏ రాగమైన తన రహదారిలోకి వాలిపోయి, సరాగాలు పలకవలసిందే…….
జానపద గీతాలు, కర్ణాటక సంగీతమైన
లలిత సంగీతమైన తన ప్రయోగశాలలో ఇమిడి పూయాల్సిందే….
ఎన్ని వాయిద్య పరికరాలు ఉపయోగించిన ఆ పాటలోని
సాహిత్యం స్పష్టంగా వినిపించడం…
ఈ స్వర జ్ఞాని ప్రత్యేకత…….
వసంతంలో విరిసిన పువ్వు లా…
జాబిలి కురిపించే వెన్నెలలా…..
అమ్మ పాడే జోల పాటలా……
స్వచ్ఛంగా అనిపించి వినిపిస్తుంది…. ఈ స్వరజ్ఞాని గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ భూగోళం
చుట్టూ తిరిగే సమయం కూడా సరిపోదేమో….సూర్యుడు మరింత
సమయం కేటాయించలేమో…….
ఈ లయ రాజు నిండు నూరేళ్లు
ఆయురారోగ్యాలతో ఉండాలని
ఆ భగవంతుడుని సంగీతాభిమానులుగా మనసారా
కోరుకుందాం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here