చికెన్ వండుకుందామని ఆ కోడిని తెచ్చాడు. ఐదున్నర నెలల ఆ కోడి మెడపై గొడ్డలితో ఒక్కటిచ్చాడు. దెబ్బకు తల కట్ అయ్యింది. ఐతే పూర్తిగా కట్ అవలేదు. ముఖ్యంగా తల నుంచీ శరీరానికి మెదడు సిగ్నల్స్ పంపించే జుగ్లర్ వెయిన్ ( జుగ్లర్ నరం) కట్ అవ్వలేదు. ఓ చెవి, చాలావరకూ మెదడు కూడా కోడి మెడతోపాటే ఉండిపోయింది. ఆ టైంలో స్లిప్ అయిన కోడి పరుగులు పెట్టింది. దాన్ని పట్టుకోవడంలో లాయిడ్ ఓల్సె్న్ ఫెయిల్ అయ్యాడు. పైగా కోడి మెడ నుంచీ వచ్చిన బాధాకరమైన అరుపులు అతనికి మానసికంగా జాలి కలిగించాయి. దాంతో ఆ కోడిని చంపి తినాలనే ఆలోచన పోయి… దాన్ని బతికించాలనే ఆలోచన వ‌చ్చింది.

కళ్లలో చుక్కలు వేసేందుకు ఉపయోగించే ఐ డ్రాపర్‌తో కోడి మెడలోకి పాలు, నీళ్లూ పోశాడు. అదే విధంగా… చిరు ధాన్యాలు, మొక్కజొన్న, చిన్న చిన్న పురుగుల్ని కూడా ఓ సిరంజి గొట్టం ద్వారా మెడలోంచీ పొట్టలోనికి పోనిచ్చాడు. ఈ విషయం మెల్లమెల్లాగా ఊరంతా తెలిసింది. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్నవారంతా అబద్ధమని కొట్టిపారేసేవాళ్లు. అది నిజమని నిరూపిస్తూ… లాయిడ్… ఆ కోడిని సాల్ట్ లేక్ సిటీలోని ఉతా యూనివర్శిటీకి తీసుకెళ్లి మరీ ప్రపంచానికి వాస్తవాన్ని చూపించాడు. అంతే ఎక్కడెక్కడి వారో వచ్చి ఆ కోడిని చూసి… దాన్నీ, దాన్ని బతికిస్తున్న లాయిడ్‌నీ ఫొటోలు తీసేవారు. డజన్ల కొద్దీ మేగజైన్లూ, పేపర్లూ ఈ విషయాన్ని ప్రచురించాయి. ప్రముఖ టైమ్, లైఫ్ మ్యాగజైన్లలోనూ ఫీచర్ స్టోరీగా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here