ఆంధ్రప్రదేశ్ లో ఎంప్లాయిస్ రెండుగా చీలిపోయారా…. రెండు పార్టీలకు తమ విధేయతను ప్రదర్శిస్తున్నారా… అధికార ప్రతిపక్ష నాయకులకు కొమ్ము కాయడానికి సిద్దమయ్యారా… అవుననే విమర్శలు సర్వత్రా వినపడుతున్నాయి… మరి ఈ చీలిక ఎంతవరకు దారీ తీస్తుందో వేచిచూడాల్సిందే……

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎంప్లాయిస్ అందరూ కూడా అమరావతికి వెళ్ళడానికి విముఖత చూపినా కూడా తరువాత రాష్ట్ర అభివ్రుద్ది కోసం తప్పకుండా అమరావతికి రావాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో అందరూ కూడా అమరావతకి బయలుదేరారు… అయితే ఇక్కడ పిల్లల చదువులు వుండటంతో తమకి 5 రోజులు పనిదినాలు కల్పించాలని పట్టుపట్టడంతో ప్రభుత్వం కూడా 5 రోజుల పనిదినాలకు ఒప్పుకుంది… అంతేకాదు ఉద్యోగులకోసం ప్రత్యేక రైలును కూడా నడపేలా రైల్వే డిపార్ట్ మెంట్తో ఒప్పందం కుదుర్చుకుంది… ఉద్యోగులు కూడా సోమవారంనుండి శుక్రవారం వరకు అమరావతి పరిసర ప్రాంతాల్లో నివాసం వుంటూ తమ బాద్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు…

ఇదంతా గత ఐదు సంవత్సరాలుగా నిరాటంకంగా సాగుతూ వచ్చింది… ఇంతవరకు బాగానే వుంది.. అయితే అసలు కథ గత మూడు నెలలుగా పూర్తిగా మారిపోయింది…. ఎన్నికల వేళ్ సమీపిస్తుండటంతో సెక్రటేరియట్ మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంప్లాయిస్ మధ్య విభేదాలు మొదలయ్యాయని తెలుస్తోంది… ఇప్పటికే వున్ అసోసియేషన్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తోందని … ఎంప్లాయిస్ పార్టీలకు అతీతంగావుండాలని కొందరు కోరుకున్నారు.. అయితే అసోసియేషన్ మాత్రం వీరి మాటలను పెడచెవిన పెట్టారని వాపోతున్నారు… దీంతో మరో అసోసియేషన్ కి బీజం పడింది… అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా తమ పని తాము చేసుకుంటు పోతున్నారు…. ఎలక్షన్స్ ఎనౌన్స్ చేసినప్పటి నుండి వీరి ప్రాధాన్యత పెరిగింది

తాము మాత్రం అధికార టీడిపి ప్రభుత్వానికి మద్దతు పలికేది లేదన్నట్లు బిహేవ్ చేసారు.. ప్రతిపక్ష నాయకుడు జగన్ సీఎం అవుతారనే వుద్దేశం వారిలో రావడంతో అందరూ కూడా వైసీపి వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది… ఇంతకు ముందు కూడా అవిభాజ్య ఆంద్రప్రదేశ్ లో కూడ ఎంప్లాయిస్ టీడిపి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడంతో దాదాపు 10 సంవత్సరాలు అధికారానికి టీడిపి దూరం అయ్యింది. ఇప్పుడు కూడా అదే పరిస్తితి కనపడుతోందనే చెప్పాలి… ముఖ్యంగా వున్న అసోసియేషన్ లో కుల సమీకరణలు ఎక్కువయ్యాయని … సామాజిక సమీకరణలలో భాగంగా తమ కులానికే సంభందించిన వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యమోస్తోందనే వుద్దేశంతో వున్నట్లు తెలుస్తోంది… దీంతో ఆ సామాజిక వర్గం తప్ప ఇతర సామాజిక వర్గాలు అన్నీ కూడా వేరుగా వుండాలనే వుద్దేశంతో వున్నారని కొంతమంది ఎంప్లాయిస్ అంటున్నారు…

దీనివల్లే తెలుగుదేశాన్ని అక్కున చేర్చుకోలేమని.. వైసిపికి తమ మద్దతు వుంటుందని కూడా కొంతమంది ఉద్యోగ నాయకులు అంటున్నారు… ప్రభుత్వంలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నా కూడా తమకి ప్రధాన్యత రావడంలేదు కాబట్టి తాము వేరుకుంపటి పెడతామని కూడా చెబుతున్నారు… ఎన్నికలు పూర్తి అయినా కూడా వారిలోని విభేదాలు ఇంకా సమసిపోలేదనే చెప్పాలి… రీసెంట్ గా ఓ మీడియా ప్రసారం చేసిన కథనాలకు నిరసనగా ఎంప్లాయిస్ అందరూ కూడా నిరసన తెలపాలని నిర్ణయించారు అయితే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారే పాల్గొన్నారనే తెలుస్తోంది… అసోసియేషన్ సభ్యులు మాత్రం దీనికి దూరంగానే వున్నట్లు తెలిసింది..

ఏది ఏమైనప్పటికి వున్న పరిస్తితులు చూస్తుంటే ఈ వేడి ఇప్పటికి తీరేలా మాత్రం కనపడటం లేదు… మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాతైనా వీరిలోని విభేదాలు తీరతాయ లేక కోత్త అసోసియేషన్ ఏర్పడుతుందో వేచిచూడాలి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here