రామచరణ్ సినిమా నుంచి తప్పుకున్నాడట ఆ సినిమా కెమెరామాన్. దీనితో మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది.చిత్ర షూటింగ్ స్పీడప్ చెయ్యమని బోయపాటి చెప్పాడట రామ్ చరణ్. దీనితో బోయపాటి కి టెన్షన్ మొదలైంది.

రంగస్థలం సినిమాతో ఈ ఏడాది మంచి హిట్ ను అందుకున్నాడు రామ్ చరణ్. బాహుబలి చిత్రం తర్వాత ఆ స్థాయిలో హిట్ కొట్టి మంచి రికార్డ్స్ ని అందుకుంది రంగస్థలం. ఆ సినిమా తర్వాత చరణ్ మొదలు పెట్టిన మూవీ బోయపాటి దర్శకత్వంలో ఒక యాక్షన్ మూవీ…ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడిందట.

బోయపాటి జనరల్ గా తన సినమలను స్పీడు గానే తీస్తాడు. సరైనాడు, జై జానకీ నాయక లాంటి సినిమాలను కేవలం ఆరు ఏడు నెలలు లోనే పూర్తి చేసేశాడు.కానీ రామ్ చరణ్ చిత్రం మాత్రం చాలా లేట్ గా సాగుతుంది. ఈ చిత్రాన్ని నవంబర్ మొదటి వారంలో పూర్తి చెయ్యాలనుకున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా 35 రోజుల షూటింగ్ మిగిలివుందట. దీనితో హీరో రామ్ చరణ్ కు టెన్షన్ పట్టుకుందట.

అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రం నుంచి తాజాగా కెమెరా మెన్ తప్పుకున్నాడు. ఋషి పంజాబీ ఈ చిత్రానికి కెమెరా మాన్ గా వర్క్ చేస్తున్నాడు. గతలో బోయపాటి తెరకెక్కించిన సరైనోడు, జయ జానకీ చిత్రాలకు కూడా ఆయనే కెమెరా మాన్. అయితే ఈ సినిమా సుమారు 70 శాతం పూర్తి అయ్యాక అయన వాకౌట్ చేశాడు . దానితో బోయపాటి ఇప్పుడు మరో కెమరామెన్ ని తీసుకున్నాడు. మిగిలిన 30 శాతం కూడా పూర్తి చేసి సంక్రాతికి విడుదల చేయాలనీ చరణ్ బోయపాటికి అల్టిమేటం ఇచ్చాడట. దీంతో ఇప్పుడు బోయపాటికి టెన్షన్ మొదలైందట.

అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రానికి “వినయ విదేత రామ “ అనే టైటిల్ అనుకుంటున్నారట.అయితే ఈ టైటిల్ ని ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడ అనౌన్సు చెయ్యలేదు చిత్ర యూనిట్.పైగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు.దీంతో హీరో రామ్ చరణ్ అభిమానులు కాస్త అసంతృప్తికి లోనైయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here