ఐపీఎల్ సీజన్ 12 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ఆసక్తికర పోరు ఊహించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది.
అద్భుత ఆటతీరుతో ఫ్లేఆఫ్స్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మ్యాచ్‌లో ఒత్తిడికి లోనై మ్యాచ్‌ను కోల్పోయారు.
ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి ఫైనల్ చేరాలనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలపై అత్యధిక సార్లు ఫైనల్
చేరిన చెన్నై సూపర్ కింగ్స్ నీళ్లు పోసింది.

క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ఆరు వికెట్లతో అద్భుత విజయాన్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 8వ సారి
ఫైనల్ చేరింది. మూడు సార్లు టైటిల్ నెగ్గిన ధోనీ టీమ్… మూడు టైటిల్స్ సమానంగా ఉన్న రోహిత్
టీమ్‌తో ఫైనల్‌లో తలబడబోతోంది.

సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విధించిన 148 పరుగుల విజయలక్ష్యాన్ని 19 ఓవర్లలో
4 వికెట్లు కోల్పోయి చేధించింది చెన్నై సూపర్ కింగ్స్. డుప్లిసిస్, షేన్ వాట్సన్ ఆరంభం నుంచి
అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. భారీ షాట్లకు ప్రయత్నించకుండా నిలకడగా ఆడారు.

దాంతో 10.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ దశలో
39 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న డుప్లిసిస్‌ను బౌల్ట్ అవుట్ చేశాడు.
32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మరో ఓపెనర్ షేన్ వాట్సన్, అమిత్
మిశ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సురేశ్ రైనా 11, ధోనీ 9 పరుగులు చేసి
అవుట్ అయినా 20 పరుగులు చేసిన అంబటి రాయుడు లాంఛనాన్ని పూర్తిచేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here