ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ గురువారం తన ‘‘బ్లూ ఆరిజిన్‌’’
అంతరిక్ష కంపెనీ రూపకల్పన చేసిన ‘‘లూనార్‌ ల్యాండర్‌’’ను ఆవిష్కరించారు. ఈ వాహనంలో
2024నాటికి సాంకేతిక ఉపకరణాలతో పాటు మనుషులను కూడా చంద్రుడిపైకి పంపనున్నట్లు ప్రకటించారు.

వాషింగ్టన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ‘‘బ్లూ మూన్‌’’ ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. దీన్ని ఎప్పుడు ప్రయోగిస్తారనేది వెల్లడించలేదు. 2024 నాటికి చంద్రుడిపై మనుషుల ఆవాసాలను
నిర్మించాలనుకుంటున్నామని ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. ఆ లక్ష్యాన్ని
బెజోస్‌ కంపెనీ చేరుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

చంద్రుడిపై నిర్మించబోయే మానవకాలనీల నమూనాలను కూడా బెజోస్‌ ప్రదర్శించారు. చంద్రుడి
దక్షిణధృవంలో ఈ వాహనాన్ని దింపాలనుకుంటున్నారు. సౌరవ్యవస్థలో అన్వేషణ వాహనాలకు కూడా
ఇది ఉపయోగపడుతుంది. బెజోస్‌ 2000లో ‘‘బ్లూ ఆరిజిన్‌’’ కంపెనీని స్థాపించారు.

ఏటా బిలియన్‌ డాలర్లు వ్యయం చేస్తున్నారు. భూమిపై కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను
చంద్రుడిపైకి తరలించాలనేది బెజోస్‌ ఉద్దేశం. మానవులతో చందమామపై కాలనీలు నిర్మించాలనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here