చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వుంది. పాలన సరిగా లేనప్పుడే ఇంత వ్యతిరేకత వస్తుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో చంద్రబాబును విపరీతంగా పొగిడినా, వండివార్చిన కథనాలు ఎన్ని వెలువడినా, ఇంకా ఇతర జగన్‌ వ్యతిరేక ఛానెళ్లలో ఎన్ని కథనాలు వచ్చినా ప్రజలకు తమ కళ్ల ముందు వున్న ప్రభుత్వంపై స్పష్టమైన అవగాహన వుంది. అందుకే వారు మార్పు కావాలని బలంగా కోరుకున్నారు.

ఒక వెల్లువలా పెరగాడనికి అవకాశమున్న పోలింగు పర్సంటేజిని తగ్గించడానికి చంద్రబాబు తన శక్తియుక్తులన్నీ ప్రదర్శించారు. ఆ కుట్రలకు ఒక ముద్దు పేరు బాబు పోల్‌ మేనేజ్‌మెంట్‌. అది నిజానికి ఒక పెద్ద మోసం. బాబు పోల్‌ మేనేజ్‌మెంట్‌ అనే ఫార్ములాను బద్దలు కొట్టాలి. దాన్ని ధ్వంసం చేయాలి. దాని గురించి ప్రజల్లో చైతన్యం పెంచాలి.
ఎన్నికల ముందు తాయిలాలు, రెండు రోజుల ముందు విచ్చలవిడిగా అవినీతి డబ్బుల పంపకం, దొంగలించిన డాటాతో ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం, ఎన్నికల రోజున కూడా ఓటర్లను తప్పుదోవ పట్టించడం, తనవారిద్వారా వ్యవస్థలను మేనేజ్‌ చేయడం, కుదరకపోతే వాటిని అచేతనం చేయడం, మీడియా మేనేజ్‌ మెంట్…దేవుడా ఎన్ని చేయాలో అన్నీ చేశారు చంద్రబాబు.
ఇలాంటి బాబు మార్కు పోల్‌ మేనేజ్‌మెంట్‌ మరెవరూ ఆదర్శంగా తీసుకోకూడదు. ఒక చిన్న ఉదాహరణ. పోలింగు జరుగుతుండగానే చేసిన దుష్ప్రచారమిది. వైఎస్సార్‌ సీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కు, వైఎస్‌ జగన్‌ కు మధ్యన అభిప్రాయభేదాలు వచ్చాయని.. జగన్‌ ఓడిపోతున్నాడని, ఆయనతో కలిసి పని చేసినందుకు పశ్చాత్తాపంతో వున్నానని ప్రశాంత్‌ కిషోర్‌ అనుకుంటున్నట్టుగా ఒక నకిలీ ట్వీట్‌ ను తయారు చేసి తన అనుకూలురైన వారితో ప్రచారం చేయించారు. అంటే మధ్యాహ్నం తర్వాత ఓటు వేద్దామని వెళ్లేవారిలో వైఎస్సార్‌ సీపీ గెలుపుపై అనుమానాలు కలిగించారు. ప్రశాంత్‌ కిషోర్ ధీటుగా సమాధానమిచ్చారు.

పాలకులు ఎవరైనా సరే తమ ఐదేళ్ల పాలన చూపి ప్రజలను ఓటు అడగాలి. పాలనలో ఒడిదుడుకులుంటే క్షమాపణ అడిగి తిరిగి అవకాశమిస్తే సరిదిద్దుకుంటామని చెప్పాలి. ఎలాంటి ప్రలోభాలు లేని స్వచ్ఛమైన, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజలు ఓటు వేసుకునే రోజులు తిరిగి రావాలి. ఎన్నికల్లో బాబు మార్కు పోల్‌ మేనేజ్‌ మెంట్‌ కనుమరుగైపోవాలి. దానిపై నేటితరంలో చైతన్యం పెంచాలి. ఎన్నికల నిర్వహణను పటిష్టం చేయాలి.
చెమికల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here