కేంద్రంలో చక్రం తిప్పేందుకు చంద్రబాబునాయుడు కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెల 19న
చివరి దశ ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలో సమావేశం నిర్వహించబోతున్నారు. ఈనెల 19న భేటీకి అవకాశం లేకపోతే మే 23వ తేదీలోపు ఏదో ఒకసారి భేటీ
కావాలని చంద్రబాబు అన్ని పక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

మే23 తర్వాత భేటీ అవుతామని ఆయన స్పష్టం చేశారు.ఎన్నికల్లో గెలుపుపై విపక్షాలు ధీమాగా
ఉన్నాయని చెప్పిన చంద్రబాబు.. ప్రధానిగా ఎవరు ఉండాలనే విషయం అప్పుడు నిర్ణయిస్తామన్నారు.
ఆ మీటింగ్ ప్రధాన ఉద్దేశం అదే అవుతుందని చెప్పారు.
.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here