ప్రధాని నరేంద్రమోదీ స్థానంలో ఈ నెల 23వ తేదీ తర్వాత కొత్త ప్రధాన మంత్రి రానున్నారని
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా
బెనర్జీ ఇప్పటివరకూ బెంగాల్‌ టైగర్‌గానే పేరుపొందారని, రాబోయే భాజపాయేతర ప్రభుత్వంలో
ఆమె కీలక పాత్ర పోషించి దేశానికే బెబ్బులి అవుతారని వ్యాఖ్యానించారు.

పశ్చిమబెంగాల్‌లోని జార్‌గ్రామ్‌, హాల్దియాల్లో జరిగిన బహిరంగ సభల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున
ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత బెంగాలీ భాషలో ప్రసంగించారు.
ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు, అక్కడ మహనీయుల గొప్పతనం గురించి బెంగాలీలో వివరించారు.

మతం ముసుగులో పశ్చిమబెంగాల్‌లో అడుగుపెట్టాలని చూస్తున్న నరేంద్రమోదీ-అమిత్‌షాల ఆటలు
సాగనివ్వొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. భాజపాకు చోటివ్వటమంటే మతవిద్వేషాలకు ఆజ్యం
పోయటమేనని, జాతీయ పౌర పట్టిక, పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొస్తామంటూ దేశంలో మరో
సంక్షోభం సృష్టించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని, ఆ కుట్రలను తిప్పికొట్టాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here