ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ అలుపెరగని పోరాటం చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అందులో భాగంగా డిసెంబర్ 27 న ఢిల్లీ లోని జంతర్ మంతర్ వేదికగా వంచన పై నిరసన దీక్షను చేపడతామని అయన తెలిపారు. ఈ దీక్షలో హోదా కోసం రాజీనామా చేసిన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, సమన్వయ కర్తలు పాల్గొంటారని భూమన తెలిపారు. హోదా విషయంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించిన తీరును ఢిల్లీ వేదికగా మరోసారి ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు.

హోదా విషయంలో మోసపోయిన ప్రతీ తెలుగు వాడి గొంతును వైఎస్సార్ సీపీ తన గళం ద్వారా వినిపించాలని భావిస్తున్నట్లు అయన తెలిపారు. దీనికి పార్టీ శ్రేణులు అందరూ తరలి రావాలని, అలాగే గాయపడిన తెలుగు ప్రజల  మద్దతు కావాలని అయన కోరారు.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here