ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై భీమవరంలో దాడి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఏపీలోని పలు నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తోంది.
ఆ పార్టీ అధ్యక్షుడైన కేఏ పాల్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం అసెంబ్లీ స్థానంతో పాటు నాగబాబు పోటీ చేస్తున్న నరసాపురం లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్నారు.

భీమవరంలో ఎన్నికల ప్రచారం చేయడానికి స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో బస చేసిన కేఏ పాల్… తనపై కొందరు దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. గత రాత్రి తనపై కొందరు దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. తన గదికి పరిసరాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలంటూ హోటల్ యాజమాన్యాన్ని కేఏ పాల్ డిమాండ్ చేశారు.

కంప్యూటర్ పనిచేయట్లేదని చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు హోటల్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చింది. అందులో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కొందరు యువకులు పాల్ రూమ్‌కి చేరుకున్నట్లు తెలుస్తోంది. అభిమానుల మంటూ పాల్‌పై దాడి చేసేందుకు వారి యత్నించినట్టు సమాచారం. ఆయన గట్టిగా అరవడంతో వారు పారిపోయినట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here