మిస్టర్‌ పాక్‌ పీఎం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు… అణు బాంబులు మీ దగ్గరే కాదు.. మా వద్ద కూడా ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. కానీ.. తొలుత జైష్‌ ఎ మహ్మద్‌, లష్కర్‌ ఎ తోయిబా సంస్థలను అంతమొందించు’ అంటూ.. ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు హితవు పలికారు.

జైష్‌ ఎ మహ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ తమ దేశంలోనే ఉన్నాడని, అతను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడంటూ.. పాకిస్థాన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి ఖురేషీ ప్రకటించడంతో పాకిస్థాన్‌.. తీవ్రవాదులకు అక్కడ ఆశ్రయం కల్పిస్తోందన్నది స్పష్టం అవుతోందన్నారు.

భారత దేశ శత్రువే తమ శత్రువని, పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు ఇక్కడ స్థానం ఉండదని ఆయన పేర్కొన్నారు. ఇస్లాం పేరుతో ముస్లింలను వంచించడం తగదని, ఇస్లాం అనేది ప్రపంచంలోని అన్ని మతాల్లోకెల్ల ఎంతో శ్రేష్ఠమైనదని గుర్తుచేశారు.

‘దేశం కోసం ప్రాణాలర్పించేందుకు భారతీయ ముస్లింలు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు. పాకిస్థాన్‌ అనుసరిస్తోన్న వైఖరిని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చేతల్ని, మాటల్ని తీవ్రంగా గర్హిస్తున్నాం. భారత ముస్లింలుగా దేశం కోసం అహోరాత్రాలు శ్రమిస్తాం. మా సైనికులకు ఏ చిన్న ఆపద వచ్చినా వెన్నంటి నిలిచి కాపాడుకుంటాం’ అని అసదుద్దీన్‌ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here