ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమ బెంగాల్‌ గడ్డపై నుంచి మరోసారి ప్రధాని నరేంద్ర
మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఆయనను మహిషాసురుడిగాతెదేపా జాతీయను, మమతా
బెనర్జీని బెంగాల్‌ దుర్గగాను అభివర్ణించారు.

దిల్లీ మహిషాసురుడిని, బెంగాల్‌ దుర్గ ఓడించాలని, దేశంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని
ఆకాంక్షించారు. మహిషాసుర మోదీని తిరిగి గుజరాత్‌ పంపించాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌
పర్యటనలో ఉన్న చంద్రబాబు గురువారం రెండో రోజు కోల్‌కతా, ఖరగ్‌పూర్‌లలో తృణమూల్‌
కాంగ్రెస్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మొదట బెంగాలీ భాషలో ప్రసంగించి, స్థానిక ప్రజల్ని ఆకట్టుకున్న చంద్రబాబు ఆ తర్వాత
ఆంగ్లంలో ప్రసంగం కొనసాగించారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌
అధ్యక్షురాలు మమతా బెనర్జీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఆమె మమతా బెనర్జీ కాదు.
మమతా ఎనర్జీ. వేయి మంది మోదీలు ధ్వజమెత్తి వచ్చినా ఆమెను ఏమీ చేయలేరు. ప్రస్తుతం
ఆమె పశ్చిమ బెంగాల్‌కే పరిమితమైన బెంగాల్‌ టైగర్‌. మారుతున్న పరిస్థితుల్లో ఆమె జాతీయ
స్థాయిలో బెబ్బులిగా మారనున్నారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here