● పార్టీలో నూతన ఉత్తేజం నింపుతున్న జిల్లా రీజనల్ కో అర్డినేటర్ వేమిరెడ్డి
● కర్నూలు ఎంపి అభ్యర్థి బివై రామయ్యనే
● నంద్యాల ఎంపి అభ్యర్థి ఇంకా అన్వేషణ
● మిగతా చోట్ల కూడా 13 నియేజకవర్గాలలో ఇంచార్జులే అభ్యర్థులు
● పాణ్యం నియేజకవర్గం జగన్ నిర్ణయం మీదే అధారం
● పార్టిని నమ్ముకొని పనిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కనబెట్టం

ఇటీవలే కర్నూలు జిల్లా రీజనల్ కో ఆర్డినేటరుగా నియమితులైన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కర్నూలు జిల్లా వైసిపిలో దూకుడు పెంచారు.కర్నూలు జిల్లాలో 2 ఎంపి స్థానాలు 14 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకునే ఏకైక లక్ష్యంతో పావులు కదుపుతున్నారు.ఇతర పార్టిలో ఉన్న అసంతృప్తి నేతలను, ఓటు బ్యాంకు కలిగిన స్వతంత్ర వ్యక్తులను, విద్యాసంస్థల, ఇతర వ్యాపార పారిశ్రామిక వేత్తలు ఇలా ఏ ఒక్కరిని దూరం చేసుకోకుండా వైఎస్సార్ సిపిలోకి ఆహ్వానిస్తున్నారు.ఈ బాధ్యతలను పార్లమెంట్ ఇంచార్జుల అధ్వర్యంలో స్థానిక నియేజకవర్గ ఇంచార్జులకు అప్పగించారు.దీంతో ఇటీవలే వలసల పర్వం ప్రారంభమైన విషయం విదితమే.

ఈ తరుణంలో ఎంపి ఎమ్మెల్యేల అభ్యర్థుల విషయంలో కొందరు పుకార్లను సృష్టిస్తున్న తీరును కొట్టి పారేశారు.పార్టీలో విభేదాలు సృష్టించి, అలజడి లేపలన్న ఉద్దేంశంతో కొందరు సరికొత్త డ్రామాకు తెర లేపారన్నారు.అయితే జిల్లాలో ఒక ఎంపి మరియు 13 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం.ఈ విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.కర్నూలు ఎంపి, నంద్యాల కర్నూలు కోడుమూరు అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో వస్తున్న పుకార్లాను ఎవరు నమ్మోద్దనీ వేమిరెడ్డి అంటున్నారు.పాణ్యం వైఎస్ జగన్ చేతుల్లో ఉన్నట్లు సమాచారం.ముఖ్యంగా కర్నూలు ఎంపి అభ్యర్థి విషయంలో వస్తున్న పుకార్లలో వాస్తవం లేదంటున్నారు.ఇంచార్జుగా ఉన్న బి.వై రామయ్యనే రంగంలోకి దిగుతారంటున్నారు.

నంద్యాల ఎంపి విషయంపై ఇంకా కసరత్తు చేస్తున్నామనీ, చివరి నిమిషంలో అభ్యర్థి ప్రకటించిన కూడా భారీ మెజారిటీతో గెలిచే విధంగా పార్టిని పట్టిష్టం చేస్తున్నామంటున్నారు.కర్నూలు ఎంపి, మరియు 13 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఎక్కడ ఢోకా లేనందున, వైసిపి ప్రటించే తొలి అభ్యర్థుల జాబితాలోనే అన్ని స్థానాలను ప్రకటిస్తామంటున్నారు.దీనికి సంబంధించిన సంకేతాలు ఇప్పటికే అభ్యర్థులకు పంపినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here