‘ముగ్ద’ అంటే సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక – అనుపమ

'Mugda' is a symbol of culture and traditions
'Mugda' is a symbol of culture and traditions

  • ‘ముగ్ద’ చూస్తే దేవాలయం గుర్తుకోస్తుంది
  • కోటగుమ్మంలో ముగ్ద షోరూమ్‌ను ప్రారంభించిన సినీతార అనుపమ పరమేశ్వరన్‌
  • పోటెత్తిన అభిమానులు..హాలో రాజమండ్రి అంటూ అభివాదం
‘Mugda’ is a symbol of culture and traditions

రాజమహేంద్రవరం నగరంలో ఏర్పాటు చేసిన కంచిపట్టు చీరల ప్రపంచం ‘ముగ్ద’ షోరూమ్‌ను చూస్తుంటే దేవాలయంలో ప్రవేశించినట్లు ఉందని సినీతార అనుపమ పరమేశ్వరన్‌ అన్నారు. చారిత్రక రాజమహేంద్రవరం నగరంలోని కోటగుమ్మం ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ముగ్ద’ కంచపట్టు చీరల షోరూమ్‌ను బుధవారం సినీతార అనుపమ పరమేశ్వరన్‌ ప్రారంభించారు. షోరూమ్‌ను ప్రారంభించిన అనంతరం ఆమె జ్యోతి ప్రజ్వలన చేయడంతోపాటు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో ఒకే రోజు రెండు షోరూమ్‌లను ప్రారంభించడం సాధారణమైన విషయం కాదని, అయితే రాజమహేంద్రవరం నగర సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా షోరూమ్‌ను ఒక దేవాలయ నమూనాలో రూపొందించడం అభినందనీయమని అన్నారు. షోరూమ్‌లోకి ప్రవేశించిన వెంటనే ఒక దేవాలయంలో అడుగుపెట్టిన భావన కల్గిందని తెలిపారు.

‘Mugda’ is a symbol of culture and traditions

రెండు తెలుగు రాష్ట్రాల్లో కంచిపట్టు చీరల వ్యాపారంలో ఎంతో మంచి పేరు తెచ్చుకుని రోజు రోజుకీ అభివృద్ధి సాధిస్తున్న ముగ్ద సంస్థ రాబోయే రోజుల్లో మరింతగా విస్తరించి వస్త్రవ్యాపారంలో రారాజుగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు. రాజమహేంద్రవరం నగరంలో అభిమానుల సందడి తనకు ఎంతో ఇష్టమని, గతంలో ఒక చిత్రం షూటింగ్‌ నిమిత్తం వచ్చి సుమారు 45 రోజులపాటు ఈ ప్రాంతంలోనే ఉన్నానని గత జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకున్నారు. సంస్థ నిర్వాహకురాలు, బ్రాండ్‌ చీఫ్‌ డిజైనర్‌ శశి వంగపల్లి మాట్లాడుతూ భారత దేశపు ప్రఖ్యాత, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా తమ సంస్థ బ్రాండ్‌ అందరికీ సుపరిచితమేనని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు ముగ్ద వినూత్నతను అందిస్తుందని తెలిపారు. విభిన్న రకాల డిజైన్లతో, వైబ్రంట్‌ కలర్స్‌, యూనిక్‌ డిజైన్స్‌తో ఆదునిక వధువులకు అవసరమైన సరికొత్త కంచి పట్టు చీరల కలెక్షన్‌ను తమ సంస్థ అందిస్తుందన్నారు.

‘Mugda’ is a symbol of culture and traditions

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందన రమేష్‌, వైకాపా రూరల్‌ నియోజకవర్గ కో`ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌, సంస్థ మేనేజింగ్‌ పార్టనర్లు ఎం.సందీప్‌ సాంబారి, మైత్రేయ, రాజేష్‌, షాపు యజమానురాలు తండ్రి వంగపల్లి సత్యనారాయణ, మాతృమూర్తి ఎ.అంజలీదేవి, తదితరులు పాల్గొన్నారు