కొడాలి నాని ఎవరో నాకు తెలియదు – ఆర్జీవి

I do not know who Kodali Nani is... RGV
I do not know who Kodali Nani is... RGV

కొడాలి నాని ఎవరో నాకు తెలీదు:ఆర్జీవీ

మంత్రి వ్యాఖ్యలపై దర్శకుడు వ్యంగ్యాస్త్రాలు

కొడాలి నాని ఎవరో నాకు తెలియదని.. నాకు సినిమా హీరో నాని మాత్రమే తెలుసని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. ఏపీలో సినిమా టికెట్‌ ధరలపై రామ్‌గోపాల్‌ వర్మ చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేసిన క్రమంలో వర్మ ఈ సందర్భంగా స్పందించారు. తాజాగా దర్శకుద రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే.  

వర్మకు కౌంటర్ గా మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ..  పక్క రాష్ట్రంలో నివాసం ఉంటూ అక్కడ సినిమాలు తీసుకునేవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు ఏమాత్రం లేదని, రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమకు మొదటి ప్రేయారిటీ అని తెలిపారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆర్జీవీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

”ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల విషయంపై నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్‌కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని సినిమా హీరో నేచురల్‌ స్టార్‌ నాని ఒక్కడే. వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు” అని ఆర్జీవీ అన్నారు.