వికేంద్రీకరణకు మద్దతుగా ..

మూడు రాజధానులకు మద్దతుగా చిత్తూరు జిల్లా పీలేరులో విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ  విద్యార్థి విభాగ రాష్ట్ర కార్యదర్శి చక్రధర్  ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో విధ్యార్ధులు హాజరయ్యారు. అనంతరం పీలేరు, నాగలూరు రోడ్ల కూడలిలో మానవహరం నిర్వహించి “ఒక రాజధాని వద్దు – మూడు రాజధానిలు ముద్దు “ అంటూ నినాదాలు చేశారు.