గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త – మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి జగన్

  • గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త
  • ఇచ్చిన మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి  జగన్
  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ ప్రారంభం

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అంతా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ మొదలయ్యింది. ఈరోజు విశాఖ జిల్లాలో వి.మాడుగుల, దేవరాపల్లి , రావికమతం మండలాల పరిధిలోని  దాదాపు 30 మంది వెల్ఫేర్ అసిస్టెంట్ ల ప్రోబెషన్ డిక్లేర్ చేస్తూ జిల్లా కలెక్టర్  ఉత్తర్వులు జారీ చేశారు.(Good news for the employees of the Village Ward Secretariat – Chief Minister Jagan who kept his word)

మాట ఇచ్చిన విధంగానే

ముఖ్యమంత్రి జగన్ మాట ఇచ్చిన విధంగానే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ప్రభుత్వం సెప్టెంబర్ 29 వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.  అప్పటి నుంచి క్షేత్ర స్థాయిలో ఈ ఉత్తర్వులు అమలు కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మరియు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఉన్నతాధికారులను క్రమం తప్పకుండా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వ చిత్తశుద్ది, అసోసియేష్ కృషి ఫలితంగా ఈ రోజు లక్షా ముపైనాలుగు వేల మంది ఉద్యోగుల ఆశలు ఫలించేలా మొదటి అడుగు విశాఖ జిల్లాలో పడింది.

ఒక్కసారిగా ఒక్క లక్ష 34 వేల మందికి ఉద్యోగాలు

చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒక్కసారిగా ఒక్క లక్ష 34 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా, ఇచ్చిన  మాట ప్రకారం వారికి రెండు సంవత్సరాలు పూర్తి కాగానే ప్రొబేషన్  డిక్లేర్ చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కే వెంకట రామి రెడ్డి.