త్వరలో జగన్ సంచలన ప్రకటన(Chief Minister Jagan Making a Sensational Statement About Amaravati)

ఆంధ్ర్రప్రదేశ్‌కు మూడు రాజధానుల విషయంపై ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గలేదా ?

ఏపీ అసెంబ్లీలో  సీఎం జగన్  చెప్పినట్టు మరో కొత్త బిల్లు తెస్తారా (Chief Minister Jagan making a sensational statement about Amaravati)?

అమరావతి రైతులు ఆ రేంజ్లో ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం విశాఖ వైపే మొగ్గు చూపుతోందా?

2014లోనే అధికారంలోకి వస్తామని భావించిన వైసీపీ… ప్రకాశం జిల్లా దొనకొండను రాజధానిగా చేయాలని భావించిందన్న ప్రచారం జరిగింది. అయితే టీడీపీ అమరావతివైపు మొగ్గు చూపింది. ఆ క్రమంలో జగన్ సర్కారు ఇప్పుడు నిధుల లేమితో దొనకొండ వైపు కాకుండా విశాఖ వైపు చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

త్వరలోనే బిల్లు

మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్నామని, మళ్లీ త్వరలో మరో బిల్లు తెస్తామని అసెంబ్లీ వేదికగానే సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.(Chief Minister Jagan making a sensational statement about Amaravati) మూడు రాజధానుల విషయంలో మరింత కొత్తగా, ఎలాంటి న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకు రావాలని, సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్నారా ? అంటే ఔననే వైసీపీ వర్గాల నుంచి సమాధానం వస్తోంది.

JSR Real Estates, Rajahmundry
Chief Minister Jagan making a sensational statement about Amaravati

టైమ్ ఫిక్స్

తాజాగా   విశాఖనే రాజధానిగా చేస్తుందని, ఆ ప్రక్రియకు టైం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.  ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. అతి త్వరలోనే రాజధాని విషయంలో ప్రకటన కూడా చేస్తారని తెలుస్తోంది. రాష్ట్ర జనాన్ని, ముఖ్యంగా అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్ని, ఇన్నాళ్లూ వేధించిన ప్రశ్నకి ఇక జగన్ మోహన్ రెడ్డి సర్కారు సమాధానం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. రానున్న ఉగాది తర్వాత ఒక క్లియర్ ప్రకటన చేస్తారని, ఈ విషయంలో సీఎం స్పష్టమైన వైఖరితో ఉన్నారని సదరు మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు సాంకేతిక అంశాల పరిశీలిన అనే మాట తప్పితే.. మిగతా అంశాలన్నిటినీ వైసీపీ ముందుకు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.  చూడాలి మరి ఇక ఏం జరుగుతుందో..?