తెలుగు దేశం పార్టీ కనుమరుగు అవ్వడం ఖాయం -వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సతీష్ కుమార్

YSRCP state joint secretary Satish Kumar said that the Telugu Desam Party is sure to disappear after 2024.
YSRCP state joint secretary Satish Kumar said that the Telugu Desam Party is sure to disappear after 2024.

2024 తరువాత తెలుగు దేశం పార్టీ కనుమరుగు అవ్వడం ఖాయమని వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సతీష్ కుమార్ అన్నారు(YSRCP state joint secretary Satish Kumar said that the Telugu Desam Party is sure to disappear after 2024). రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల్లో వస్తున్న ప్రజాదరణకు ఆ పార్టీ గల్లంతు అవ్వడం తధ్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్నీ వర్గాల ప్రజలు అసంతృప్తి గురికావడం వల్లే, ఆయన్ను అన్ని ఎన్నికల్లో ఒడిస్తూవస్తున్నారని తెలిపారు. ఏ ఎన్నికైన, ఏ సెంటరైన సింగిల్ హ్యాండ్తో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తూ వస్తుందని, తెలుగు దేశం పార్టీ ప్రస్తుత పరిస్థితి చాలా దయనీయంగా ఉందని సతీష్ కుమార్ ఎద్దేవా చేశారు. అసత్య ప్రచారాలతో విజయం సాధించడం కష్టమనే విషయాన్ని ఆ పార్టీ, ఆ పార్టీ అధినేతలు ఇప్పటికైనా గ్రహించాలని హితువు పలికారు. విశాఖ మున్సిపల్ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు గెలుపొందడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు.