Home PoliticsGuru AP Politics వైసీపీ ఆరాచాకలు చూస్తుంటే.. అసహ్యం వేస్తుంది – చంద్రబాబు

వైసీపీ ఆరాచాకలు చూస్తుంటే.. అసహ్యం వేస్తుంది – చంద్రబాబు

tdp chief chandrababu has expressed deep dissatisfaction over the conduct of the kuppam municipal elections
tdp chief chandrababu has expressed deep dissatisfaction over the conduct of the kuppam municipal elections

కుప్పంలో జరిగిన ఎన్నికల తీరుపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులే కుప్పంలో దగ్గరుండి దొంగ ఓట్లు వేయిస్తున్నారని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వేరే ప్రాంతాల నుంచి ప్రజలను తొలుకొచ్చి దొంగ ఓట్లు పోల్ చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ తీరును చూస్తుంటే రాజకీయాలంటేనే చీరాకేస్తుందని బాబు ఆవేదన చెందారు. సిగ్గూ, శరం లేకుండా వ్యవహరిస్తున్న వైసీపీ నేతల వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని.. వారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన తెలిపారు. చివరకు పోలింగ్ ఏజెంట్ లను కూడా అరెస్టు చేశారని.. గతంలో ఏ సీఎం కూడా ఇంత దారుణంగా ప్రవర్తించ లేదని వ్యాఖ్యానించారు. ఇలాగే వీరి ఆరాచకాలు కొనసాగిస్తే వారికి ఓట్లు వేసిన ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని అన్నారు. చివరికి ధైర్యంగా ఓట్లు వేసే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈసీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. వైసీపీతో అధికారులు కుమ్మక్కై ఎన్నికలకు వెళ్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అసలు ఈ రాష్ట్రంలో ఈసీ ఉందాని ఆయన ప్రశ్నించారు.     

Exit mobile version