రాజధాని విషయంలో జగన్ కొత్త వ్యూహం ?

jagan amarathi
jagan amarathi

రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్న జగన్, ఇంకా దానికే కట్టుబడి ఉన్నారా?

ఇప్పుడు మూడు రాజధానులు కాదు, నాలుగు అంటున్నారా? ఏపీ వంటి పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రానికి ఒక రాజధాని అయితే చాలు అదే పది వేలు అని అన్న వారే ఎక్కువగా ఉన్నారు. అయినా జగన్ వికేంద్రీకరణ అంటున్నారు. తాజాగా మూడు రాజధానుల బిల్లు కూడా అసెంబ్లీలో ఉపసంహరించుకున్నారు. అయితే ఆయన అమరావతిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్న టాక్ ఉంది. మరిలాంటి పరిస్థితుల్లో ఆయన చేయబోతున్నారో ?

ఏపీ వంటి పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రానికి ఒక రాజధాని అయితే చాలు అనేవారు ఉన్నారు. అయితే అభివృద్ధి కోణంలో చూస్తే చిన్న రాష్ట్రం అయినా విభేదాలు మరిన్ని ముదరకుండా ఉండాలంటే వికేంద్రీకరణ మంత్రం బెటర్ అని జగన్ గట్టిగా భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలోనే మూడు రాజధానుల కాన్సెప్ట్ ని తెర మీదకు తెచ్చారు ముఖ్యమంత్రి జగన్. అయితే ఆ చట్టంలో ఎన్నో లోపాలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడంతో దాదాపు రెండేళ్ల తరువాత సడెన్ గా అసెంబ్లీ వేదికగా దానిని  రద్దు చేసుకున్నారు.

ఇది అంతా అంగీకరిస్తున్నా వైసీపీ నేతలు మాత్రం మేము ఒప్పుకోమనే తమ పాత వాదన వినిపిస్తున్నారు. మరి మూడు రాజధానుల చట్టం లేదు కదా అంటే అంత కంటే మంచి చట్టం తెస్తాం. మూడు రాజధానులు ఏపీకి ఖాయమని చెబుతున్నారు. సరే ఎవరి వాదన ఎలా ఉన్నా కూడా జగన్ మదిలో ఏముంది అన్నదే ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ స్పీచ్ చూస్తే మేలైన మెరుగైన కొత్త బిల్లుతో వస్తామని చెప్పారు. అలాగే మూడు రాజధానులు ఉంటాయా లేదా అన్నది కూడా క్లారిటీ లేదు. సరిగ్గా ఈ సమయంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఏపీలో మూడు కాదు, నాలుగు ప్రాంతాలను విభజించి అభివృద్ధి కోణంలో రీజనల్ బోర్డులను ఏర్పాటు చేస్తారంటున్నారు

నిజానికి ఈ బోర్డులు కూడా కొత్త కాదు. ఉమ్మడి ఏపీలో అప్పట్లో ఏర్పాటు చేసినవే. ఇక విభజన ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో రీజనల్ బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే అప్పట్లో అది ఎందుకో మరుగున పడిపోయింది. ఇక రీజనల్ బోర్డులు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల మధ్య అభివృద్ధిని బ్యాలన్స్ చేయమని సలహాలు ఇచ్చింది కూడా శివరామ కృష్ణ కమిటీయే.

దాంతో జగన్ ఆ కమిటీ సూచనల మేరకు అంటూ ఏపీలోని నాలుగు రీజనల్ బోర్డులను కొత్తగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టారని అంటున్నారు. ఉత్తరాంధ్రా మూడు జిల్లాలు ఒక బోర్డు, ఉభయ గోదావరి జిల్లాలు, క్రిష్ణాను కలుపుతూ ఒక బోర్డు, గుంటూర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో మరో బోర్డు, రాయలసీమ నాలుగు జిల్లాలతో మరో బోర్డు ఏర్పాటు చెస్తారని తెలుస్తోంది.

ఇక ఈ బోర్డులకు చైర్మన్లుగా సీనియర్ నేతలను, మాజీ మంత్రులను నియమించి వారికి క్యాబినేట్ హోదా ఇస్తారని అంటున్నారు. ఈ బోర్డుల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలకు నిధులను సమానంగా ఖర్చు చేయడమే కాదు, అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలని చూస్తున్నారంట. ఆ విధంగా అమరావతిని రాజధానిగా ఉంచుతూనే మిగిలిన చోట్ల అభివృద్ధి చేయాలన్నది జగన్ మార్క్ అజెండాగా ఉందంటున్నారు. అదే కనుక జరిగితే మాత్రం మూడు రాజధానుల విషయాన్ని మరచిపోవచ్చు అంటున్నారు.

ఇలా ఏర్పాటు చేయడం వల్ల ఏ రకమైన న్యాయపరమైన చిక్కులు ఉండవు, రాజధాని ఉద్యమాలు ఉండవని కూడా భావిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కూడా సాఫీగా జరుగుతుంది అని అంటున్నారు. ఇక అమరావతి రాజధానిలో కొత్త నిర్మాణాలను కూడా చేపట్టడం ద్వారా అక్కడ వ్యతిరేకతను అధిగమించాలని చూస్తున్నారుట. చూడాలి మరి ఏం జరుగుతుందో.