దమ్ముంటే ఢిల్లీ వెళ్ళి డెడ్ లైన్లు పెట్టండి – కొడాలి నాని

రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు భయపడే వారు లేరని మంత్రి కొడాలి నాని అన్నారు. మంగళ వారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు.  విశాఖ ఉక్కు ప్రవేటికరణ పై మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ముదుగు వచ్చారని, ఆయనకు కనువిప్పు కలిగినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.     

రాష్ట్ర సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందనన్నారు. అటువంటి మాకు.. జనసేన డెడ్ లైన్లు పెట్టం ఏంటని ప్రశ్నించారు. దమ్ముంటే ఢిల్లీ వెళ్ళి ప్రధానికి డెడ్ లైన్ పెట్టలని సలహా ఇచ్చారు. రాష్ట్రంలో పూర్తిగా చనిపోయిన పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ అని, పోటీ చేసిన రెండు చోట్ల గెలవని పార్టీ నాయకుడు మాకు డెడ్ లైన్లు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.