తెలుగు అకాడమీ డిపాజిట్ గోల్ మాల్ విషయంలో ముగ్గురు అరెస్ట్ ?

తెలుగు అకాడమీ నగదు గోల్మాల్ కేసులో పోలీసులు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మర్కంటైల్ క్రెడిట్ సొసైటీ ఉద్యోగి మొహినుద్దీన్, యూబీ మేనేజర్ మస్తాన్ వలీ, అగ్రసేన్ బ్యాంక్ మేనేజర్ పద్మావతిలను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రాధమిక విచారణలో వీరు కోట్ల రూపాయలను దారిమళ్లించినట్లు తెలిసింది.

తెలుగు అకాడమీ 11 బ్యాంకులలో సుమారు మూడు వందల ముప్పై కోట్లను డిపాజిట్ చేసింది. అయితే ఈ గోల్ మాల్ వ్యవహారంలో బ్యాంక్ అధికారుల పాత్ర ఉందంటూ తెలుగు అకాడమీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. సరైన పత్రాలు చూసాకే వాటిని క్లోజ్ చేశామని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.