మా ఎన్నికలపై రవి బాబు సంచలన వ్యాఖ్యలు

ప్రకాష్ రాజ్ – మంచు విష్ణుల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. మా ఎన్నికల ప్యానల్ సభ్యులు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ ఎన్నికలను తలపిస్తున్న మా ఎన్నికల వల్ల ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లొసుగులు బయటపడుతున్నాయి. ప్రకాష్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో విష్ణు పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దానికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు మంచు విష్ణు. ఇదిలా ఉంటే నటుడు, దర్శకుడు రవి బాబు సోషల్ మీడియాలో అప్లోడు చేసి ఒక వీడియోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ లోకల్ నాన్ లోకల్ విషయం నేను మాట్లాడ దల్చుకోలేదు. అలాగే ఈ ప్యానల్ కో ఆ ప్యానల్ కి ఓటేయమని కూడా చెప్పాను. ఆర్టిస్ట్ లను, కెమెరా మ్యాన్, మేకప్ మ్యాన్, హేయర్ డ్రెస్సర్ లను బయట నుంచి తీసుకొస్తున్నాం. మన సినిమాల్లో పెడుతున్నాం. మరి ఇప్పుడు మా అసోసియేషన్ కు బయట వారు కావాలా ? మీరే ఆలోచించుకోండి అని వీడియో అప్లోడు చేశారు రవి బాబు.