అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి మూడు కోట్ల అరవై లక్షల రూపాయల వ్యయంతో ఇండోర్ ఉప కేంద్రాన్ని ఆళ్ళ నాని ప్రారంభించారు. ఏలూరు నియోజక వర్గ ప్రజలకు నిరంతరం కరెంట్ సరఫరా లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నెలకొల్పినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాని తెలిపారు.   

ఈ ఉపకేంద్రం వల్ల ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 8 డివిజన్లకు 24 గంటలు పాటు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాకి ఈ ఉపకేంద్రం బాగా ఉపయోగపడుతుందని మంత్రి నాని చెప్పారు.   

పట్టణాలు గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిధులను కేటాయించి సబ్ స్టేషన్ ల నిర్మాణాలకు చర్యలు చేపట్టనట్లు నాని తెలిపారు.  

ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్ లు గుడిదేసి శ్రీనివాస్, నూక పెయి సుధీర్ బాబు, ఏయంసి చైర్మన్ మంచం మై బాబు, వైయస్ఆర్ సీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, మధ్యాహ్నపు బలరాం, బొద్దని శ్రీనివాస్, కిలాడి దుర్గారావు, నెరూసు చిరంజీవి, నరేంద్ర, కార్పొరేటర్లు నిడికుండ అన్నపూర్ణ, తంగెళ్ల రాము, జుజ్జువరపు విజయ విజయనిర్మల, సుంకర చంద్రశేఖర్,పొలిమేర దాస్, కమిషనర్ డి చంద్రశేఖర్, ఏలూరు ఎమ్మార్వో సోమశేఖర్,  ట్రాన్స్కో ఎస్ఇ జనార్దన్ రావు, ఈఈ శ్యాం బాబు, ఇంజనీర్లు మురళీధర్, సురేష్, వేణుగోపాల్, సురేష్ రెడ్డి, భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు