తగ్గేదెలే… అంటున్న ‘పుష్ప’ రాజ్

సుకుమార్ దర్శికత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న  ‘పుష్ప’  చిత్రం రిలీజ్ డేట్ ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఐకాన్ స్టార్ అభిమానులకు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17 న మొదటి పార్ట్ ను పుష్ప ది రైజ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రను పోషిస్తున్నారని తెలిపారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు అనేకం ఉన్నాయని చెప్పారు. బిన్నీ పక్కా మాస్ గెటప్ లో అదరగొట్టబోతున్నారని తెలిపారు. బన్నీకి జతగా రష్మిక, శ్రీవల్లిగా సందడి చేయనున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందుస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దేవిల కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ చిత్రం కావడం మరో విశేషం.