మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్‌కు తెదేపా పొలిట్‌బ్యూరోలో చోటు

తెదేపా రాష్ట్ర కమిటీలో పార్టీ అధినేత చంద్రబాబు కొత్త వారికి చోటు కల్పించారు. మండలి మాజీ ఛైర్మన్, శ్రీ ఎమ్.ఏ. షరీఫ్‌కు పొలిట్‌ బ్యూరోలో అవకాశం దక్కింది. మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్‌ను పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తెదేపా జాతీయ అధికార ప్రతినిధిగా గురజాల మాల్యాద్రికి అవకాశం నియమించారు.  రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులుగా నల్లమిల్లి, బాంజ్‌దేవ్ లు చోటు దక్కించుకున్నారు. తెదేపా రాష్ట్ర కమిటీలో 48 మందికి అధినేత చంద్రబాబు చోటు కల్పించారు.