నామినేషన్ విత్ డ్రా చేసుకున్న బండ్ల గణేష్

బండ్ల గణేష్ ‘మా’ ఎన్నికల్లో తన నామినేషన్ని ఉపసంహరించుకున్నారు. ఆయన ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. ఆత్మీయుల సలహాల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్ లతో దిగిన ఫోటోను ఈ సందర్భంగా షేర్ చేశారు.