రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

మధిరలో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సిపిఎం కార్యాలయంలో  మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతే మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, అన్నం పెట్టే రైతుకి గిట్టుబాటు ధర కావాలని కోరారు. భారత దేశంలో సామాజికంగా వెనకబడిన కులం ఏదైనా వుంది అంటే అది రైతు కుటుంబమేనని తెలిపారు. వ్యవసాయం దండుగ కాదు పండుగనే రోజు రావాలని ఆయన ఆకాంక్షించారు. రైతుల సంక్షేమం కోసం తీసిన రైతన్న సినిమాను ఆదరించండని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం సిపిఐ పట్టణ కార్యదర్శులు శీలం నరసింహారావు,బెజవాడ రవి బాబు పాల్గొన్నారు.