రాష్ట్రంలో 70 శాతం ప్రజలు రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారు. ఏమిటి లాభం ?

డిఎల్ రవీంద్ర రెడ్డి తన సొంత పార్టీ పైనే ఘాటు విమర్శలు చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశరు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఘాటుగా స్పందించిన డిఎల్ తాను 2024 ఎన్నికల్లో ఏ పార్టీ తరుపున పోటీ చేస్తారో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన డిఎల్ ప్రకటించి వార్తల్లో నిలిచారు.

రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితితులు నెలకున్నాయని, మంత్రులు డమ్మీలుగా మారి పోయారని ఆరోపించారు. రావాలి జగన్ కావాలి జగన్ అని కోరుకున్న వారికీ, రెడ్లు ప్రభుత్వం కావాలని కోరుకున్న వారికి ప్రభుత్వ పనీతిరుతో తగిన బుద్ధి వచ్చిందని వ్యాఖ్యానించారు.  

నేడు రాష్ట్రంలో రైతును పట్టించుకునే నాధుడు కరువై, వ్యవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. దొంగ ఆయిల్ వ్యాపారం చేసే అంబటి కృష్ణారెడ్డికి ఆ శాఖలో సలహా దారుడి పదవి కట్టబెట్టారు. నేడు కౌలు రైతులు కరువైపోయారు. నా సొంత పొలం కౌలుకు ఇద్దామంటే ఏ రైతు ముందుకు రావడం లేదు.

ప్రభుత్వం ఇచ్చే ఐదు వందలు, వెయ్యికి ఆశపడి ఎవరు బ్రతకవలసిన అవసరం లేదని..   అలా బ్రతకవోద్దని.. సొంతగా సంపాదించడం నేర్చుకోమని హితువు పలికారు. సొంత ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పాలకులు పని చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా సంబంధిత శాఖలు వారు ప్రెస్ మీట్ పెట్టడం లేదని దారిన పోయే వారందరూ పత్రిక సమావేశాలు పెడుతున్నారని అన్నారు.  

“సమాజంలో జరుగుతున్న అక్రమాలపై పాలకులను మీడియా ప్రశ్నించాలి. ప్రశ్నించుకుంటే అధోగతి పాలవుతుంది. భూములు ఆక్రమించుకోవడం ఖజానా నింపుకోవడమేనా మన పాలకులు పని ? రాష్ట్ర పరిస్థితి, భావితరాల గురించి ఎవరు ఆలోచన చేయడం లేదు. పేదల బియ్యాన్ని 70 శాతం ప్రజలు తినకుండా అమ్ముకుంటున్నారు. సబ్సిడీ ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టం ద్వారా అందించడం ఉత్తమం. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదంటూ” విరుచుకుపడ్డారు.