రాజమండ్రి లో చిరు

  • రాజమండ్రిలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం.. ఆవిష్కరించిన చిరంజీవి
  • హోమియోపతి కళాశాలలో ఏర్పాటు
  • విగ్రహ ఏర్పాటుకు అల్లు అరవింద్ ఆర్థికసాయం
  • రూ.2 కోట్లతో నూతన భవనం

ప్రముఖ సినీ హాస్యనటుడు దివంగత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఏపీలోని రాజమండ్రిలో అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాల ఆవరణలో అలనాటి గొప్ప నటుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అల్లు అరవింద్ ఆర్థిక సహకారం అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి అక్కడకు వెళ్లారు. కళాశాల ప్రాంగణంలో రూ.2 కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని కూడా ప్రారంభించారు.