పవర్ స్టార్ అభిమానులకు దసరా పండుగ

  • దసరాకి ‘భవదీయుడు భగత్ సింగ్’ షూటింగ్ ప్రారంభం!
  • ‘గబ్బర్ సింగ్’తో లభించిన భారీ హిట్
  • పవన్ తో మరోసారి సెట్స్ పైకి
  • ఆల్రెడీ టైటిల్ పోస్టర్ కి అనూహ్యమైన రెస్పాన్స్
  • రెండు భారీ హిట్లతో జోరు మీదున్న హరీశ్

పవన్ కల్యాణ్ చిత్రాల్లో సంచలన విజయాన్ని సాధించిన చిత్రంగా ‘గబ్బర్ సింగ్’ కనిపిస్తుంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, విడుదలైన ప్రతీ ప్రాంతంలో వసూళ్ల వర్షం కురిపించింది. అప్పటి నుంచి అభిమానులు తిరిగి ఈ కాంబినేషన్లో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతకాలనికి ఈ కాంబినేషన్లో ఒక ప్రాజెక్టు సెట్ అయింది. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా రూపొందనుంది. ఇటీవలే ఈ టైటిల్ ను ఖరారు చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందాని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 15 న ‘విజయదశమి’ నాడు లాంఛనంగా మొదలుకానుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో పవర్ స్టార్ సరసన పూజ హెగ్డే ప్రధాన కథానాయకగా నటిస్తుందని ఊహాగానాలు వినబడుతున్నాయి.