www.breakinguru.com

శాసనమండలి రద్దుపై అసెంబ్లీలో జరిగిన చర్చపై అధికార పక్షం ఎమ్మెల్యేలు తన ప్రసంగాలతో విరుచుకుపడ్డారు. ఈ సంధర్భంగా మంత్రి పేర్ణి నాని మాట్లాడుతూ.. పెద్దల సభైనా మండలి పట్ల తనకు చాలా గౌరవభావం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసం చేసే చట్టాలపై శాసనమండలి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత మండలిలో తెలుగుదేశం పార్టీ తన బలంతో రాష్ట్ర అభివృద్దిని అడ్డుకుంటుందని విమర్శించారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చట్ట సభలో అధికార పక్షం చేస్తున్న చట్టాలను మండలిలో అడ్డుకోగలం అనే భావనలో ఉన్నారని.. అయితే ఆయన అనుకున్న విధంగా మండలిలో అడ్డుకోవడం అంటే పరోక్షంగా ప్రజల అభివృద్దిని అడ్డుకోవడమేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇటువంటి కుట్ర రాజకీయాలు మానుకోవాలని లేదంటే ఈ సారి 23 సీట్లు కూడా రావన్నారు.   

జగన్ లక్ష్యానికి చంద్రబాబు అడ్డుకట్ట :

సీఎం జగన్ గారు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు కోసం… వారు జీవితంలో వారు స్థిరపడాలనే మంచి ఆలోచన చేశారు.అటువంటి ఆ పేద విద్యార్ధుల అభ్యున్నతి కోసం ఆంగ్లమాద్యమంలో బోధనను తప్పనిసరి చేస్తే.. చంద్రబాబు దానికి శాసనమండలిలో మోకాలడ్డటం చాలా బాధాకరం విషయమన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కులాల హక్కుల పరిరక్షణకు, ఆయా కులాలకు ప్రత్యేకంగా కమీషన్లు వుండాలని సీఎం జగన్ భావించారు. దానిపై సభలో తీర్మానం చేసి శాసనమండలికి పంపితే దానిని అడ్డుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. జగన్ గారి ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు జరగకూడదనే కుట్రగా మండలిలో తన సభ్యులతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో బడుగు వర్గాల పేదల కోసం ముఖ్యమంత్రి జగన్ ఒకపక్క పవిత్ర యజ్ఞం చేస్తుంటే.. మరోపక్క చంద్రబాబు అండ్ కో ఆ యజ్ఞంను భగ్నం చేయాలని ప్రయత్నిస్తున్నారు. శాసనసభలో తల్లి తాటకి మాదిరిగా చంద్రబాబు…మండలిలో కుమారుడు సుబాహుడు మాదిరిగా లోకేష్ బిల్లులను అడ్డుకోవడం వారి మానసిక వైకల్యంకు అద్దం పడుతుందన్నారు.

శాసనసభ, మండలి సంప్రదాయాలకు, నిబంధనలకు అనుగుణంగా నడవాల్సి ఉండగా కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబు విషపూరిత ఆలోచనలతో నడిపించే ప్రయత్నం చేస్తున్నారని.. గతంలో లేని దుష్ట సంప్రదాయాలకు చంద్రబాబు నాంధి పలుకుతున్నారని తెలిపారు.

గుర్తుపెట్టుకో జగన్ కన్నా తోపులెవరూలెరిక్కడ ..

కుట్ర పూరితంగా ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా.. అభివృద్థి వికేంద్రకరణ చేయాలనే సీఎం గారి ఆలోచనలను నిలువరించలేరు.ధైర్యం, సాహసం, దృఢనిశ్చయం పుట్టుకతో రావాలి. అది వైఎస్ ముఖ్యమంత్రి జగన్ సొంతం. మన చంద్రబాబుకు మాత్రం అధికారంతోనే ఈ లక్షణాలు వస్తాయి.. అధికారం పోవడంతోనే అవన్నీ పోతాయని మంత్రి నాని దుమ్మెత్తిపోశారు. ఈ సందర్భంగా గడిచిన సభలో వైఎస్ జగన్ గారిని, శాసనసభ్యులను చంద్రబాబు వేలు చూపించి మాట్లాడారని ఆయన గుర్తుచేశారు. జాగ్రత్త, మీ అంతు చూస్తాను అంటూ బెదరించి సంగతి ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారని ఇప్పుడు అధికారం దూరమైయ్యాక జగన్ గారు అంటూ నమస్కారాలు పెడుతున్నారని చెప్పారు. అధికారం ఉన్నా లేకున్నా కూడా ధృఢచిత్తంతో ఒకేలా వ్యవహరించే దమ్మున్న నాయకుడు జగన్ అని కొనియాడారు. చంద్రబాబు తన 40 ఏళ్ళ అనుభవంతో ప్రజా సంక్షేమం కోసం జగన్ చేస్తున్న మంచిని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం మంచిపని కాదని..  ఆయన నభై ఏళ్ల అనుభవం ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగపడితే అందరికీ సంతోషంగా ఉంటుందని మంత్రి నాని హితువు పలికారు.

చంద్రబాబులాంటి వాళ్ళు కోటికొక్కరు ఉంటారు :

అప్పట్లో చంద్రబాబు అంటూ..  2004 లో మండలిపై చంద్రబాబు మాట్లాడిని ఒక వీడియోని అసెంబ్లీలో ప్లే చేశారు. దాని మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. శాసనమండలి కొనసాగింపు, ప్రజాస్వామ్యానికి జరిగే మేలు గురించి ఆకాశమే హద్దుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు.మండలి గురించి చంద్రబాబు చాలా సుద్దులు చెబుతున్నారు.గతంలో చంద్రబాబు శాసనమండలి గురించి ఎంత వ్యతిరేకంగా చెప్పిన వీడియోలను అందరూ గమనించాలి.శాసనసభలో ఆనాడు చంద్రబాబు ఎంత అగౌరవ భావంను వ్యక్తం చేశారో గమనించాలి.శాసనమండలి ప్రజాస్వామ్యానికి ఊపిరి అని ఈరోజు చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు జీవితం మొత్తం ప్రతి నిర్ణయం కూడా యూటర్న్ ల మయం. నిన్న ఒకలా… ఈరోజు ఒకలా… మాట్లాడే దౌర్భాగ్యం చంద్రబాబుకు సొంతం. నూటికో…కోటికో ఒకరికి వుంటే ఈ లక్షణం చంద్రబాబుకు వుంది.గతంలో రాష్ట్రంను విడదీస్తే… ఊరుకోమని అన్నారు.తరువాత రాష్ట్రాన్ని విడగొట్టమని చంద్రబాబు లేఖ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయిన తరువాత రెండు కళ్ళ సిద్దాంతం అంటూ బస్సుతో తిరిగాడు. బిజెపి ప్రభుత్వం మతతత్వ పార్టీ అని చంద్రబాబు విమర్శించాడు. తరువాత స్పీకర్ పదవి తీసుకున్నారు.అంశాల వారీ మద్దతు అన్నారు… ఆ తరువాత బిజెపి ప్రభుత్వంలో చేరారు.2004 ఎన్నికల ఓటమి తరువాత బిజెపితో పొత్తు చారిత్రాత్మక తప్పిదమని చంద్రబాబు అన్నాడు. 2014లో మోదీ కాళ్లకు మొక్కి ఆయనతో అంటకాగారు. ప్రత్యేక హోదా కావాలంటూ కేంద్రాన్ని కోరుతున్నాని అన్నాడు. ఎన్నికల తరువాత హోదా వద్దు ప్యాకేజీ కావాలని కోరాడు.నాలుగేళ్లు అయిపోయిన తరువాత ప్యాకేజీ వద్దు హోదా అంటూ యూటర్న్ తీసుకున్నాడు. ఆనాడు మోదీ రాష్ట్రానికి వస్తే గో బ్యాక్ అన్నాడు

ఈనాడు రాజధానిని ఎలా మారుస్తారు… మాకు మోదీ వున్నాడని చంద్రబాబు ఎలా అంటాడు? రాహూల్ గాంధీ గుంటూరు వస్తుంటే… అడ్డుకోవాలని పిలుపునిచ్చాడు. కర్ణాటక ఎన్నికల సందర్బంగారాహూల్ కు మద్దతు ఇచ్చారు. ఏకంగా రాహూల్ గాంధీ ప్రధానమంత్రి అంటూ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ వద్దని అన్నాడు… మళ్ళీ ఆమాట అనలేదని చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడు. ముందు ఒక మాట.. వెనుక ఒక మాట చంద్రబాబు నైజం. బాధ్యత వున్న జగన్ గారికి కొంత అధికారం తగ్గితే… బాధ్యత లేని చంద్రబాబుకు కొంత అధికారం దక్కితే… ఏం జరుగుతుందో తాజాగా చూశాం.ఈరోజు పత్రికారంగం కూడా దుర్మార్గమైన పోకడలు పోతోంది.తన అనకూల మీడియాలో చంద్రబాబు తప్పుడు కథనాలు రాయిస్తున్నాడు. ప్రజాజ్వామ్యంలో బాధ్యత లేకుండా పత్రికలు ప్రవర్తించడం బాధాకరం, దుర్మార్గం. చంద్రజ్యోతి, డ్రామానాడు గత ఎన్నికల సందర్బంగా జగన్ గారిపై విషం చిమ్మాయి.అయినా కూడా ప్రజలు జగన్ గారికి ఉవ్వేత్తున మద్దతు పలికారు.ఈ పత్రికలు నేడు కూడా విషం చిమ్ముతున్నాయి. అయినా శ్రీ వైఎస్ జగన్ గారిని ఏమీ చేయలేవంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

పాలనా వికేంద్రీకరణ ఇప్పుడు రాష్ట్రానికి ఎంతో అవసరం :

గతంలో మనం చూశాం..  రాజధాని కేంద్రీకృతం అవ్వడం వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి. వాటిని అధిగమించడానికి వికేంద్రీకరణను సీఎంగారు తీసుకువచ్చారు.ఒకచోట పరిపాలన, ఒక చోట శాసనసభ, మరోచోట న్యాయ రాజధానులను పెట్టాలని భావిస్తున్నారు.అందుకు చంద్రబాబుకు ఎందుకు వ్యతిరేకత చూపుతున్నారో చెప్పితీరాలి. అంతేకాదు ఆయన అధికరంలో ఉన్న కాలంలో అమరావతి ప్రాంతంలో వున్న కృష్ణ , గుంటూరు జిల్లాలకు ఏం చేశారో చెప్పాలి.

బాబుకి వంద ప్రశ్నలు :

ఈ రాష్ట్రానికి గుండెకాయగా వున్న పోలవరంను కూడా 2017 సంవత్సరం ప్యాకేజీ ప్రకటించే వరకు ఒక్క ఇటుక రాయి కూడా తీసిపెట్టలేదు. కృష్ణా డెల్టా మోట్రనైజేషన్‌ పై ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది.కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగునీటిపై దృష్టి పెట్టలేదు. అమరావతికి కూతవేటుదూరంలోని నియోజకవర్గాల్లో సాగునీటి కోసం కష్టాలు పడ్డాం. రామాయపట్నం పోర్ట్ కు ఆలోచన కూడా చేయలేదు. కన్నతల్లికి అన్నం పెట్టని వాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానని అన్నాడంట చంద్రబాబు తీరు అలాగే ఉంది. అలాగే ఈ ప్రాంతానికి నీరు ఇవ్వలేని చంద్రబాబు రాయలసీమకు, పులివెందులకు నీరు ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. అందుకే రాయలసీమలో వారికి వచ్చిన సీట్లు కేవలం మూడంటేమూడు.కనీసం కృష్ణాడెల్టాలోని చివరి ప్రాంతాల్లో సాగుకు నీరు ఇవ్వలేకపోయాడు. వెనుకబాటుకు గుర్తింపుగా వున్న ప్రాంతంలో వంశధార ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయాడు.అయిదేళ్ళలో చంద్రబాబు బందరు పోర్ట్ ను పట్టించుకోలేదని చంద్రబాబుపై ఎదురుదాడి చేశారు మంత్రి నాని.  

అభివృద్ధే లక్ష్యంగా జగన్ సర్కార్ :

జగన్ సర్కార్ రాష్ట్ర అభివృధే లక్ష్యంగా ముందుకుపోతుందని.. దానికోసం ఎన్ని కష్టలయినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. బందర్ పోర్ట్ పనులను మరో నాలుగు మాసాల్లో ప్రారంభించేందుకు సీఎం గారు హామీ ఇచ్చారు. దివి తాలూక, బందరు ప్రాంతాల్లో తాగు, సాగునీటి కష్టాలను తీర్చడానికి కృష్ణా నదిపై మినీ బ్యారేజీలు నిర్మిస్తానని సీఎంగారు చెప్పారు.అమరావతి ప్రాంతంలో అర్బనైజేషన్ కోసం వైకుంఠపురం రోడ్ కం బ్యారేజీ నిర్మించేందుకు చర్యలు చేపడతామని అన్నారు.విజయవాడకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు జాతీయరహదారికి రింగ్ రోడ్ లతో అనుసంధానం చేస్తానని చెప్పారు.అమరావతి 29 గ్రామాలకు హైవేతో కనెక్టివిటీ కల్పిస్తానని సీఎంగారు చెప్పారు.కొల్లేరు ఎండిపోతోందని సీఎం గారి దృష్టికి తీసుకువెడితే… మూడు రెగ్యులేటర్లు ఏర్పాటుకు హామీ ఇచ్చారు.ఆకువీడు, మొగల్తూరు, గొల్లపాలెం సమీపంలో ఒక రెగ్యులేటర్ను మూడు వందల కోట్లతో నిర్మించేందుకు ప్రభుత్వం ముందకు వచ్చింది.మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణంకు సీఎం గారు హామీ ఇచ్చారు.డెల్టా ఆధునీకరణను వచ్చే ఏడాది నుంచి చేపడతామని జగన్ గారు స్పష్టం చేశారు. 2023 నాటికి పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని జగన్ గారు హామీ ఇచ్చారు. ఇటువంటి బృహత్కరమైన ప్రణాళికలతో సీఎం శ్రీ వైఎస్ జగన్ గారు ముందకు వెడుతున్నారని మంత్రి తన ప్రసంగంతో అందర్నీ ఆకట్టుకున్నారు.

నిబంధనలకు విరుద్దంగా మండలి తీరు :

చక్కటి ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే.. మరోవైపు శాసనమండలిలో ప్రజలకు మేలు చేసే అంశాలను అడ్డుకుంటున్నారు.తాజాగా మండలిలో జరిగిన సంఘటనలు నిబంధనల ప్రకారం జరగలేదు. సభలోని పిడిఎఫ్, బిజెపి, వైసిపి సభ్యుల మనోభావాలను పరిగణలోకి తీసుకోలేదు. కేవలం తన రాజకీయ వ్యాపారం కోసం… వికృత భావాలతో చంద్రబాబు మండలిని ప్రభావితం చేశారు. నిబంధనలకు విరుద్దంగా విచక్షణాధికారం పేరుతో అడ్డంకులు కల్పించారు.

రద్దుకే నా మద్దతు :

ముఖ్యమంత్రి జగన్ గారుప్రవేశ పెట్టిన శాసనమండలి రద్దుకు పూర్తి మద్దతు పలుకుతున్నా. దానిని సభ ఆమోదించాలని కోరుతున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here