www.breakinguru.com

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు మూడు రాష్ట్రాల ప్రతిపాదన బిల్లు అలాగే సీఆర్డీఏ రద్దు బిల్లుతోపాటు మండలి రద్దు నిర్ణయాలపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు సంబంధించిన నాయకలు తమ తమ వాణిని వినిపిస్తున్నాయి. అసలే పేద రాష్ట్రం, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ నుంచే పాలన చేయవచ్చునంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తులసిరెడ్డి తప్పుబట్టారు. రాజధాని రైతులకు, మహిళలకు వ్యతిరేకంగా, సర్కారుకు అనుకూలంగా వాదించడానికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవసరమాని ఆయన ప్రశ్నించారు.ఈ సంధర్భంగా బొత్స వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. పెద్దల సభ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి న్యాయం చేయకపోవడం దుర్మార్గం అని వ్యాఖ్యానించడం అత్యంత హేయంగా ఉందని అన్నారు. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడం వల్ల మంచే జరుగుతుందని, దీనిపై ఇంత రాద్దాంతం చేయడం సరికాదన్నారు.

మండలి రద్దు అనుకున్నంత సులువుకాదని ఆర్టికల్ 169/1 ప్రకారం మీరు చట్టం చేసినంత మాత్రాన అవ్వదని, పార్లమెంట్ నిర్ణయం ప్రకారమే శాసన మండలి రద్దు అవుతుందనే విషయం కూడా మీకు తెలియదాని తులసి రెడ్డి ప్రశ్నించారు. శాసన సభలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలను అదిగమించడానికి పెద్దల సభ ఎంతో అవసరమని తెలిపారు. ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని చరిత్ర హీనులుగా చరిత్రలో నిలిచిపోవద్దని ఆయన హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here