www.breakinguru.com

మూడు రాజధానుల బిల్లు శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపించడం పై మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి గొల్లపూడి వన్ సెంటర్ లో భారీ ఎత్తున టపాసులు పేల్చి ప్రజలతో కలిసి తన హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం అని మండలి చైర్మన్ పై మతం పేరుతో దూషించారని గదిలోకి వెళ్లి మంత్రులు దౌర్జన్యానికి పాల్పడి అరాచకంగా ప్రవర్తించినా చైర్మన్ షరీఫ్ గారు ప్రజాస్వామ్య విలువలను కాపాడారని దేవినేని కొనియాడారు. ఈ సందర్భంగా కొడాలి నాని వ్యాఖ్యలపై స్పందిస్తూ కొడాలి నాని మా చావు కోరుకున్నారని మేము అంత తేలికగా చావబోమని వైసిపి భూస్థాపితం చేసి తీరుతామని దేవినేని కొడాలి నానిని హెచ్చరించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు పట్ల నాని తీరు గర్హనీయమని అమరావతి ద్రోహిగా నాని, మంత్రులు, ఎమ్మెల్యేలు చరిత్రలో నిలిచిపోతారని నేడు శాసనమండలిలో చంద్రబాబు పట్ల లోకేష్ పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని దేవినేని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here