www.breakinguru.com

ప్రజా సంక్షేమం కోసం అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అడ్డుకోవాలనే దురుద్దేశంతో శాసనమండలి జరుగుతుందని, ఇటువంటి పరిస్థితుల్లో అసలు మండలి కావాలా? వద్దా ? అనే అంశంపై చర్చ జరపాల్సిన అవసరం ఉందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.ఆయన గురువారం అసెంబ్లీలో సీడీఆర్ఏ, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై మాట్లాడుతూ.. మండలి ఛైర్మన్ ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన తీరుపై స్పందించారు. అసలు మండలి గ్యాలరీలో చంద్రబాబు ఎందుకు కూర్చోవాల్సివచ్చిందో మొదట సమాధానం చెప్పాలన్నారు.       

పరిపాలన వికేంద్రీకరణ బిల్లు వెంటనే చట్టం కాకూడదనే సెలెక్ట్ కమిటీకి పంపారని, దీనివల్ల మరో రెండు మూడు నెలలు జాప్యం జరుగుతుందని వివరించారు. నిబంధనల ప్రకారం బిల్లుపై ఓటింగు జరుగుతుందని తాను భావించానని, తీరా చూస్తే మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపడంతో ఆశ్చర్య పోయానని పేర్కొన్నారు. ముందుగా సవరణలు ప్రవేశపెట్టాల్సి ఉండగా .. ఆపని చేయలేదని, తదుపరి కర్తవ్యంగా ఓటింగ్ జరిగిందా అంటే అదీ జరగలేదని చెప్పుకొచ్చారు. వీటన్నింటికీ విరుద్ధంగా ఛైర్మన్ విచక్షణ అధికారమంటూ సెలెక్ట్ కమిటీకి పంపడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమ కోసం తీసుకున్న నిర్ణయాలు ఇలా మండలి నుంచి రాజకీయాలు చేయడం తగదన్నారు.ఎంత కాలం ఆపగలరని ఆయన ప్రశ్నించారు.    

రైతులను ఇప్పటివరకు మోసం చేసింది చాలదన్నట్టు మరోమారు చంద్రబాబు మోసం చేయాలని చేసి ప్రయత్నాన్ని రైతులు గమనించాలని, రైతులు కూడా ఆయన ఉచ్చులో మరోసారి పడొద్దని తెలియజేశారు.   

ముఖ్యమంత్రి జగన్ చాలా క్లియర్గా శాసనసభ అమరవతిలోనే జరుగుతుందని చెప్పిన విషయాన్ని అంబటి మరోమారు ఈ సంధర్బంగా గుర్తుచేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వంతో చర్చించుకోవాలని సూచించారు. వ్యవస్థలను నిర్వీర్యపరచడంలో నారా వారు దిట్ట అని ఈ ప్లాన్ లో భాగంగా విమర్శించారు. రాష్ట్ర అభివృద్దికి శాసనమండలి నిరోధకంగా మారుతున్నప్పుడు.. మండలి కొనసాగింపుపైన సుదీర్ఘ చర్చలు జరగాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here