చంద్రబాబు రాజధాని పేరుతో అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, ఆయనపై సుప్రీం కోర్టు, హైకోర్టు సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. శనివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో అనేక మంది అమాయక రైతుల మాగాణి భూములను చంద్రబాబు తన సన్నిహితులకు, కోటరీకి ధారదత్తం చేశారని,రైతుల సొమ్మును నొక్కేశారని తెలిపారు.  ఇక్కడి రైతుల ఆవేదనను అస్సలు పట్టించుకోలేదు. భూ దందా విధానం హుందాగా వ్యవహరిస్తున్నట్లు బయటకు చెబుతూనే ఆయన మరోపక్క కుమారుడు లోకేష్‌, అప్పటి మంత్రులుగా ఉన్న యనమల, పత్తిపాటి, దూళిపాళ్ల నరేంద్ర, పయ్యవుల కేవశ్‌.. ఇలా ఎంతో మందితో రాజధాని ప్రాంతంలో భూములు ఆయనే కొనుగోలు చేయించారు. రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్నది వాస్తవమని, చంద్రబాబు రాజ్యాంగ ప్రమాణాన్ని తుంగలో తొక్కారు తెలిపారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here