• గ్రేటర్ రాయలసీమ ఇవ్వాల్సిందే – జేసీ దివాకర్ రెడ్డి
  • రేపు భారతి సీఎం కావొచ్చు.

మందడంలో జరుగుతున్న రైతుల ఆందోళనలో పాల్గొన్న మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్ సర్కార్పై ఫైర్ అయ్యారు.  ‘‘ఈ రోజు చాలా దురదృష్టకరమైన రోజు.కేవలం తుళ్లూరు, మందడంలోని ప్రజలే కాదు..మనమందరమూ దురదృష్టకర పరిస్థితుల్లో ఉన్నాం.జగన్ సీఎం కాగానే విశాఖ పోవాలని అనుకున్నారు.రాజధాని అంటే ఆయన ఒక్కరి అభిప్రాయం మాత్రమేకాదు.రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయాలతోనే రాజధానిపై నిర్ణయం తీసుకోవాలి. ఒక వ్యక్తి కులంపై ద్వేషంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిపద్ధతి కాదు. జగన్‌ సీఎం అయ్యాక దిల్లీ, విశాఖకు ఏడు నెలలుగా కాళ్లు కింద పెట్టకుండా విజయసాయిరెడ్డి తిరిగారు. ఇవాళ జగన్‌ సీఎం అయ్యారు.. రేపు భారతి కావొచ్చు. ఆమె సీఎం అయ్యాక మళ్లీ ఈ ఒప్పందం చెల్లదంటే కుదురుతుందా? ఇది బ్రిటిష్ పరిపాలన కాదు.. రాక్షసుల రాజ్యం. ఈ రాజ్యంలో అందరికీ కష్టాలే. 29 రోజులుగా రైతులు, మహిళలు దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. మూర్ఖత్వం ముందు పుట్టి తరువాత జగన్ పుట్టాడు. సీఎం ఫ్యాక్షన్ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు. అమరావతి రాజధాని కాకపోతే రాష్ట్రం విడిపోయి గ్రేటర్ రాయలసీమ పెట్టాల్సిందే. రాయలసీమ నుంచి అమరావతి రావడానికే బాధలు పడుతున్నాం..ఇక విశాఖపట్నం పోవాలంటే ఎంత కష్టం? మహిళలు భోజనం చేయంతమాత్రాన జగన్ మారుతారా? కుక్క కాటుకు చెప్పుదెబ్బలా సమాధానం ఇవ్వాలి. 23న రాయలసీమలో సమావేశం పెట్టాం. అమరావతి రాజధానిగా కొనసాగాలని తీర్మానం చేస్తాం..లేదంటే గ్రేటర్ రాయలసీమ ఇవ్వాల్సిందే. మహిళలు వీర నారీమణులు కావాలి. జైల్ భరో కార్యక్రమమే ప్రభుత్వానికి సమాధానం’’ అని జేసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here