ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి మంగళగిరిలో లక్ష్మీ నర్శింహస్వామిని స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి పానకాల స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం అధికారులు స్వామిజీని మేళ తాళాల మధ్య పూర్ణకుంభంతో ఆలయంలోకి ఆహ్వానించారు. లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర విశిష్టతను పండితులు స్వామీజీకి వివరించారు. నరసింహ స్వామి భక్తులు పరమ పవిత్రంగా భావించే దక్షిణావృత శంఖు నుంచి స్వామీజీకి తీర్థం అందించారు. ఇక్కడి బంగారు శంఖు తీర్ధానికి విశేష ప్రాధాన్యత ఉంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించడం సంతోషం కలిగిందన్నారు స్వామి స్వాత్మానందేంద్ర. పానకాల స్వామి ఆశీస్సులతోనే సన్యాస స్వీకారం చేపట్టిన తర్వాత మళ్లీ ఈ ఆలయానికి వచ్చానని చెప్పారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన దైవ దర్శనం చేస్తే హరిహరాదుల దర్శనభాగ్యం కలిగినట్లే అన్నారు. భక్తులకు అసౌకర్యం కలబంద మంగళగిరి దేవస్థానం చేపట్టిన ఏర్పాట్లను స్వామీజీ అభినందించారు. స్వామి స్వాత్మానందేంద్ర వెంట సిమ్స్ విద్యాసంస్థల అధినేత భీమనాదం భరత్ రెడ్డి, శివశిరీష దంపతులు ఉన్నారు.

Previous articleధర్మప్రచారానికి సైనికుల్లా కదలండి
Next articleమత్స్యకారులకు మిఠాయిలు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here