– త్రిపురాంతకంను సందర్శించిన స్వామిజీ

– మర్యాద పూర్వకంగా స్వామీజీని కలిసిన మంత్రి ఆదిమూలపు సురేష్

– గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర

విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర ప్రకాశం జిల్లాలో ముగిసింది. మంగళవారం ఉదయం మార్కాపురం నుంచి  త్రిపురాంతకం మీదుగా సాగిన యాత్ర గుంటూరు జిల్లాకు ప్రకాశం చేరుకుంది. త్రిపురాంతకంలో చారిత్రక ప్రాశస్త్యమున్న పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయాన్ని స్వాత్మానందేంద్ర సరస్వతి సందర్శించారు.

మంత్రి ఆదిమూలపు సురేష్ తో కలిసి ఆలయానికి వెళ్లారు. దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వామిజీకి స్వాగతం పలికారు. పండితులు ఆలయ ప్రాశస్త్యాన్ని స్వామీజీకి తెలిపారు. రాక్షస  సంహారానికి, త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు. అనంతరం కుమారగిరి దిగువున చెరువు గర్భంలో ఉన్న బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయాన్ని కూడా స్వామిజీ సందర్శించారు. విశాఖ శారదాపీఠం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ఉన్న శ్రీచక్రం ఎదుట స్వామిజీ భక్తిశ్రద్ధలతో మోకరిల్లారు. ఆలయ పరిసరాల్లో ఉన్న అరుదైన కదంబ వృక్షం వద్ద స్వామిజీ కొద్దిసేపు గడిపారు.

Previous articleJustInGuru
Next articleజగన్ని విమర్శిస్తే సహించేది లేదు – పద్మజ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here